Chartered Accountant: దేశాభివృద్ధిలో సీఏ ల పాత్ర మరింత కీలకం కావాలి..
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్ర, దేశాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల (సీఏ) పాత్ర ఎంతో కీలకమని గుంటూరు జిల్లా సీజీఎస్‌టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి అన్నారు. మొగల్రాజపురంలోని ఓ హోటల్‌లో శనివారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడశాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ అనే అంశంపై ఎస్.వైద్యనాథ్ అయ్యర్ స్మారక ఉపన్యాసం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి జరిగే దేశంతోపాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.
High Jump: జాతీయస్థాయిలో హైజంప్‌కు ఎంపికైన విద్యార్థిని
ఈ అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలకపాత్ర పోషించాలని సూచించారు. లక్ష్యసాధనకు భాష అవరోధం కాదని, తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థులు కూడా చక్కటి నైపుణ్యాలను పెంపొందించుకుని ఆయా రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యులుగా తయారుకావచ్చని తెలిపారు. కార్యక్రమానికి ఐసీఏఐ విజయవాడశాఖ మాజీ చైర్మన్ జీ.శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, విజయవాడ ఐసీఏఐ బ్రాంచి చైర్మన్ వీ.నరేంద్రబాబు, సెక్రటరీ కె. నారాయణ, మేనేజింగ్ కమిటీ సభ్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు పాల్గొన్నారు.