Job opportunities: యువత ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవాలి
ఎచ్చెర్ల క్యాంపస్: ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉద్యోగ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ అన్నారు. ఎస్‌ఎంపురం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శుక్రవారం ఇంజినీరింగ్, ప్రీ యూనివర్సిటీ విద్యార్థులకు నెహ్రూ యువ కేంద్రం శ్రీకాకుళం, స్థానిక జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మై భారత్ యాప్‌పై అవగాహ న కల్పించారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా విద్యా ర్థులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన భవిష్యత్ కోసం దేశంలోని విద్యాలయాల్లో అందిస్తున్న విద్య, ఉద్యోగ రిక్రూట్‌మెంట్‌లు, జాబ్ క్యాలెండర్, సర్వీస్ కమిషన్ పరీక్షలు, నిర్వహణ తీరు, సిలబస్, విధి, విధానాలు తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి సమాచారం అంతా మై భారత్ యాప్‌లో లభిస్తుందన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రిక్రూట్‌మెంట్‌ల్లో జాతీయ స్థాయిలో అత్యున్నత ఉద్యోగ నియామకాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం కార్యదర్శి రవీంద్ర పాల్గొన్నారు.