Jagananna Vidya Deevena: పేదింట విద్యా దీవెనలు
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, డిప్లొమా వంటి కోర్సులు చదివే పేద విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన పథకం కింద అందిస్తోంది. దీంతోపాటు జగనన్న వసతి దీవెన పేరుతో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇలా పేద విద్యార్థుల ఉన్నత చదువుల కలను సాకారం చేస్తోంది. దీనిపై అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ఏలూరు జిల్లాలో రూ.383.42 కోట్లు, వసతి దీవెన పథకం ద్వారా రూ.142.96 కోట్లను ప్రభుత్వం ఇప్పటివరకు అందజేసింది. ఆయా పథకాల ద్వారా జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది.
చదవండి: ITDA PO: సిలబస్ పూర్తి చేయకపోవడంపై పీవో ఆగ్రహం
చదువుకు జగనన్న భరోసా
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఊతం
జగనన్న విద్యా, వసతి దీవెనల కింద రూ.526 కోట్ల అందజేత
జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులకు సాయం
సంవత్సరం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన
విద్యార్థులు లబ్ధి (రూ.కోట్లలో) విద్యార్థులు లబ్ధి (రూ.కోట్లలో)
2019–20 36,527 95.78 36,580 36.86
2020–21 37,148 77.97 37,750 35.76
2021–22 38,677 105.67 36,350 34.76
2022–23 33,655 103.98 32,316 30.96
మొత్తం లబ్ధి 383.42 142.96