Andhra Pradesh: విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇలా చేస్తేనే మీ అకౌంట్‌లో డబ్బులు జమ.. చివరి తేదీ ఇదే
జగనన్న విద్యాదీవెన వెరిఫికేషన్ పూర్తికాలేదని మెసేజ్ వచ్చిన విద్యార్థులు వెంటనే ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి.. ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్‌కు సంబంధించిన ప్రత్రాలను సమర్పించాలి. వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత ఇన్ఎలిజిబుల్ అయితే.. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లను కలవాలి. జగనన్న విద్యాదీవెనకు అర్హత ఉన్న విద్యార్థులు ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఫిబ్రవరి 21వ తేదీ వరకు చివరి గడువు ఉంది. మార్చిలో జగనన్న విద్యాదీవెన డబ్బులను ప్రభుత్వం మీ అకౌంట్‌లో జమ చేయనుంది.
జగనన్న వసతి దీవెన కింద..
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనల ద్వారా చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే రిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థల జీఈఆర్ రేష్యో 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది. 2018 –19 తో పోలిస్తే.. 2019–20 మధ్య పెరుగుదల దేశవ్యాప్తంగా 3.04 అయితే, మన రాష్ట్రంలో 8.6శాతంగా నమోదయ్యింది. జీఈఆర్ దేశవ్యాప్తంగా ఎస్సీల్లో 1.7శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28శాతం ఉంటే.. మన రాష్ట్రంలో ఎస్సీల్లో 7.5, ఎస్టీల్లో 9.5శాతం.. విద్యార్థినుల్లో 11.03శాతంగా నమోదయ్యింది. చదువుల కోసం భారం ఉండకూడదు. గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి. దేశం కన్నా మనం మెరుగ్గా ఉన్నాం ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్ చదివేవాళ్లకి రూ.15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి రూ.20వేలు
ఇస్తున్నారు.
ఈ ఘటనను ఎప్పటికీ నేను మరిచిపోలేను...: వైఎస్ జగన్
11.03 లక్షల మంది విద్యార్ధులకు..
2021లో జగనన్న విద్యా దీవెన మూడో విడత కింద 11.03 లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుస్తూ 9,87,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను ముఖ్యమంత్రి జగన్ నవంబర్ 30న తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసిన విషయం తెల్సిందే..
1902కు కాల్‌చేస్తే..
ఈ డబ్బులు పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఎందుకు జమ చేస్తున్నామంటే...
పిల్లల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లి వారే ఫీజులు కట్టడం వల్ల కాలేజీల్లో పరిస్థితులను చూస్తారు, కాలేజీల యాజమాన్యాలను అడగలుగుతారు. కాలేజీల్లో కూడా జవాబుదారీతనం వస్తుంది. ఏమైనా సమస్యలున్నా, సదుపాయాల లోపం ఉన్నా కూడా 1902కు కాల్‌చేస్తే.. ప్రభుత్వం వాటిమీద దృష్టి పెడుతుంది. ఆ కాలేజీల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే కార్యక్రమం చేపడుతుంది.
Jagananna Vidya Deevena: కార్యక్రమం అమలుకు ఆమోదం
Education: 100% గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం
AP CM YS Jagan : 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన..ఫీజుల చెల్లింపు వివరాలు ఇలా..
‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు: ఫీజులపై ఒత్తిడి చేయొద్దు