Skip to main content

Indian Army: జూలై 8 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

 Hyderabad Army Recruitment News  Headquarters Unit Quota Update  Indian Army  Army Recruitment Rally Announcement   Military Officials Statement

సాక్షి, హైదరాబాద్‌: హెడ్‌క్వార్టర్స్‌ యూనిట్‌ కోటా కింద ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని జూలై 8 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహించను న్నట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకోసం ఈ ర్యాలీ నిర్వ హిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు స్పోర్ట్స్‌ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 5న ఉదయం 6 గంటల నుంచి సికింద్రాబాద్‌ ఏఓసీ సెంటర్, థాపర్‌ స్టేడి యంలో ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.

Campus Recruitment: ప్లేస్‌మెంట్స్‌లో లక్షల జీతంతో కొలువు దీరుతున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులు

స్పోర్ట్స్‌ కోటా కింద జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా అథ్లెటిక్‌ పోటీలో పాల్గొని ఉన్నవారే అర్హులన్నారు. ఈ ఉద్యోగా లకు దరఖాస్తు చేసుకునే అర్హులైన అభ్యర్థులు అదనపు వివరాల కోసం ‘www. joinindianarmy@nic.in’ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.

Published date : 29 May 2024 12:50PM

Photo Stories