Exam: జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు..
కానీ కేరళ యూనివర్సిటీ పరీక్షలో మాత్రం విద్యారి్థకి ఏకంగా జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు. ఇంకేముంది.. ఆ విద్యార్థి దొరికిందే చాన్స్ అనుకొని ఎంచక్కా పరీక్ష రాసేసి వెళ్లిపోయాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించిన వర్సిటీ పరీక్ష రద్దు చేసింది. బీఎస్సీ ఎల్రక్టానిక్స్ నాలుగో సెమిస్టర్ చదువుతున్న ఓ విద్యార్థి కరోనా వల్ల ‘సిగ్నల్ అండ్ సిస్టమ్స్’పరీక్షకు హాజరుకాలేకపోయాడు. దీంతో అతని కోసం ఈ ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆఫీస్ పొరపాటున ప్రశ్నపత్రానికి బదులు జవాబు పత్రం ముద్రించి పంపింది. ఇని్వజిలేటర్ కూడా దాన్నే విద్యారి్థకి ఇచ్చాడు. ఈ విషయాన్ని విద్యార్థి బయటకు చెప్పకుండా ఆ జవాబులను నింపేసి వెళ్లిపోయాడు. ఆ పేపర్ దిద్దిన ప్రొఫెసర్ జరిగిన పొరపాటును గుర్తించి విద్యారి్థకి ప్రశ్నపత్రానికి బదులు జవాబు పత్రం ఇచ్చారని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో ఆ ఎగ్జామ్‌ను రద్దు చేసిన యూనివర్సిటీ మే మూడో తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జరిగిన పొరపాటుపై వర్సిటీ విచారణకు ఆదేశించింది.