Skip to main content

Summer Effect: స్కూల్స్‌ ఉదయం 8 నుంచి 11.30 వరకే..

సాక్షి, ఎడ్యుకేషన్‌: వేసవి ముదరకముందే ఎండలతో తెలంగాణ మండిపోతోంది. సాధారణం కంటే 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
summer effect
Summer Effect

ఈ నేపథ్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు మార్చి 31వ తేదీ నుంచి ఒంటిపూట బడుల నిర్వహణ సమయంలో మార్పు చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్‌ ఎ.దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటులోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు మార్చి 31వ తేదీ(గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే పనిచేస్తాయన్నారు. ఏప్రిల్‌ 6 వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

Published date : 31 Mar 2022 12:18PM

Photo Stories