Skip to main content

Free tailoring training: మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

 Free sewing classes for rural women's employment   Rural Employment Organization   Free training in tailoring for women     Free sewing classes by Union Bank

చంద్రగిరి: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉచితంగా కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యూనియన్‌ బ్యాంకు గ్రామీణ ఉపాధి సంస్థ డైరెక్టర్‌ సురేష్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 30 రోజుల పాటు మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెల్లరేషన్‌ కార్డు కలిగి తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19–45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, కనీసం పదో తరగతి చదువుకున్న నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, రాను, పోను ఒకసారి బస్సు ఛార్జీలు ఇవ్వడంతోపాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు జెరాక్స్‌, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో నేరుగా సంస్థ వద్దకు వచ్చి వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఒక్క బ్యాచ్‌కు 25–30 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణాభివృద్ధి సంస్థ, ద్వారకానగర్‌, కొత్తపేట, చంద్రగిరి, లేదా 79896 80587, 94949 51289, 63017 17672 నంబర్లను సంప్రదించాలని కోరారు.

చదవండి: Mega Job Mela: జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

Published date : 10 Jan 2024 09:04AM

Photo Stories