Skip to main content

Free Training: కేవీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో ఉచిత శిక్షణ

Free Training in Data Entry Operator Course

దొండపర్తి (విశాఖ) : స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయ్‌లో ప్రధాన మంత్రి కౌశశల్‌ వికాస్‌ యోజన ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 10, 12 తరగతి డ్రాపవుట్‌ అయిన నిరుద్యోగులకు పూర్తి వివరాల కోసం శుక్ర, శనివారాల్లో స్కూల్‌లో ఉన్న కంప్యూటర్‌ ఫ్యాకల్టీని కలవాలని చెప్పారు. కోర్సులో నమోదు కోసం అభ్యర్థులు ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్‌ ఫొటోతో కేంద్రీయ విద్యాలయ్‌లో సంప్రదించాలని సూచించారు.

చ‌ద‌వండి: Andhra Pradesh: ‘జగనన్న విద్యా దీవెన’కు ఉమ్మడి ఖాతా తెరవండి

Published date : 17 Nov 2023 03:06PM

Photo Stories