Free Education in Private Schools: ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య.. షెడ్యూల్ ఇలా..
విద్యా సంవత్సరం ప్రారంభంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే నోటిఫికేషన్ విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు పాఠశాలల్లో విద్యనందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులకు వరంగా మారనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలు ఈ మేరకు వారికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంది.
పాఠశాలల్లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన విద్యార్థుల జాబితా విద్యాశాఖ విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు అర్హులు ఈ పథకానికి అర్హులు. ఉచిత ప్రవేశాలకు నిరాకరించిన యాజమాన్యాలపై విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. 2023–24లో నంద్యాల జిల్లాలో 235 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆయా మండలాల్లోని ప్రైవేట్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందారు.
Admission in Tribal Gurukul Schools: 5వ తరగతి నుంచి 9 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
2024–25 విద్యా సంవత్సరానికి..
విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం ఏటా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేదలకు 25 శాతం సీట్లు ఇచ్చే అంశాన్ని సీరియస్‌గా తీసుకు న్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ఏటా అర్హులై న పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో అడ్మిషన్ పొంది చదువుకునే అవకాశం కల్పించేలా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ అమలవుతున్న ప్రైవేటు పాఠశాల్లో 25 శాతం సీట్లు ఒకటో తరగతి విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది.
షెడ్యూల్ ఇలా..
● అభ్యర్థులు http://cse.ap.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
● ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు విద్యార్థుల వివరాల నమోదుకు అవకాశం కల్పించారు.
● మార్చి 20 నుంచి 22 వరకు విద్యార్థుల దరఖాస్తు అర్హతపై చెక్ చేసుకోవచ్చు.
● ఏప్రిల్ 1న లాటరీ పద్ధతి ద్వారా మొదటి విడత జాబితా విడుదల చేస్తారు
● ఏప్రిల్ 2 నుంచి 10వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో ఎంపికై న విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది.
● ఏప్రిల్ 15న లాటరీ పద్ధతి ద్వారా రెండవ జాబితా విడుదల
● ఏప్రిల్ 16 నుంచి 23 వరకు ఆయా పాఠశాలల్లో ఎంపికైన విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన వారు దర ఖాస్తు చేసుకు ని సద్వినియోగం చేసు కోవాలి. అర్హులైన విద్యార్థులకు లాటరీ విధానం ద్వారా సీట్లు కేటాయించడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం 18004258599 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలి. – సుధాకర్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల