Skip to main content

ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు నాలుగు ఆప్షన్లు

ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన, మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థలకు తాజాగా నాలుగు ఆప్షన్లు ప్రకటించింది.
ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు నాలుగు ఆప్షన్లు
ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు నాలుగు ఆప్షన్లు

ఈ విషయంలో ప్రభుత్వ విధానానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జారీచేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) సతీష్‌చంద్ర నవంబర్‌ 12న రాత్రి సర్క్యులర్‌ విడుదల చేశారు. ఆయా ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఇంతకుముందు ఇచ్చిన ఆప్షన్లను సరిచేసుకునేలా నాలుగు అప్షన్లను సర్క్యులర్‌లో పొందుపరిచారు. అవి..

1వ ఆప్షన్‌ :

ఎయిడెడ్‌ విద్యా సంస్థలు తమ ఆస్తులతోపాటు ఎయిడెడ్‌ సిబ్బందిని అప్పగించేందుకు సుముఖత వ్యక్తంచేస్తే వాటిని ప్రభుత్వ విద్యా సంస్థలుగా అభివృద్ధి చేస్తారు.

2వ ఆప్షన్‌:

ఆస్తులు మినహా మొత్తం ఎయిడెడ్‌ పోస్టులను, సంస్థలో ప్రస్తుతమున్న ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించే సంస్థలు ప్రైవేటు ఆన్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా కొనసాగవచ్చు.

3వ ఆప్షన్‌:

1వ, 2వ ఆప్షన్లకు సుముఖతలేని సంస్థలు ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా కొనసాగవచ్చు.

4వ ఆప్షన్‌:

1వ, 2వ ఆప్షన్లకు సుముఖత వ్యక్తం చేస్తూ ఇంతకుముందు అంగీకారం తెలిపిన విద్యా సంస్థలు వాటిని ఉపసంహరించుకోవచ్చు. ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన సిబ్బందిని వెనక్కు తీసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా కొనసాగవచ్చు. ఇక ఈ ఆప్షన్లపై సంస్థలు తమ నిర్ణయం తెలియజేయాలని, అనంతరం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సతీష్‌చంద్ర తెలిపారు. కాగా రాష్ట్రంలో 2,249 ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 1వ, 2వ ఆప్షన్లకు అంగీకరించిన సంస్థల నుంచి 6,600 మంది బోధన, బోధనేతర సిబ్బంది ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించి రిపోర్టు చేశారు.

చదవండి: 

అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఆనర్స్‌’

Jobs: భారీ ఉద్యోగ ప్రకటన

Published date : 13 Nov 2021 12:51PM

Photo Stories