Skip to main content

Navodaya Entrance Exam: నవోదయలో సీటు పొందేందుకు ప్రవేశ పరీక్షలు.. తేదీ విడుదల

జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు సంపాదిస్తే విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు పునాది పడినట్లే. ప్రవేశ పరీక్ష కోసం వివిధ తరగతుల విద్యార్థులకు సూచనలను వెల్లడించారు..
Banavasi Navodaya Vidyala

సాక్షి ఎడ్యుకేషన్‌: ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నత ప్రమాణాలతో జవహర్‌ నవోదయ విద్యాలయాలు విద్యను అందిస్తున్నాయి. 1986లో జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారత ప్రభుత్వం ఈ విద్యాలయాలను ప్రారంభించింది. 2024–2025 విద్యా సంవత్సరంలో నవోదయలో 9వ, 11వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 10వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. 9వ తరగతిలో 7 ఖాళీలకు 1,502 మంది, 11వ తరగతిలో ఉన్న ఖాళీలకు 1,595 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రెండు పరీక్షలకు ఓకే రోజు జరగనుంది.

BRAOU Admission 2024: డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో బీఈడీ ఓడీఎల్‌ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఉచిత విద్య...ఉపకార వేతనం

ప్రభుత్వం, ప్రభుత్వ ఆమోదిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఈ ఏడాది 10వ తరగతి చదువతున్న వారి నుంచి 2024–2025 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎంపీసీ(కంప్యూటర్‌), బైపీసీ తదితర కోర్సుల్లో ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నాణ్యమైన భోజనం, వసతితో పాటు 11వ తరగతి ప్రారంభం నుంచే అవంతి ఫౌడేషన్‌, టాటా మోటార్‌ కంపెనీ ప్రోత్సాహంతో నిపుణులైన అధ్యాపకులచే నీట్‌, ఎంసెట్‌ వంటి పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 12వ తరగతిలో ‘విజ్ఞాన జ్యోతి’ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ. 1000 చొప్పున ఉపకార వేతనంతో పాటు నీట్‌, ఎంసెట్‌కు సంబంధించిన మెటీరియల్‌ ఉచితంగా అందజేస్తారు.

BRAOU: ఓపెన్‌ డిగ్రీ తరగతులు ప్రారంభం

తీవ్రమైన పోటీ...

బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో 7 ఖాళీలకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 1,502 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 9వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు విద్యాలయంలో 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందనుంది. వసతితో పాటు అన్ని రంగాల్లో వారిని తీర్చిదిద్దుతారు. జిల్లా మెరిట్‌ను పరిగణనలోకి తీసుకొని విద్యాలయంలో సీట్లను భర్తీ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర మెరిట్‌ ఆధారంగా రాష్ట్రంలోని వివిధ నవోదయ విద్యాలయల్లో సీట్లను భర్తీ చేస్తారు. 11వ తరగతిలో ఖాళీలతో పాటు ప్రతి విద్యాలయంలో 40 సీట్లు మాత్రమే ఉండగా ఈ సంవత్సరం నుంచి 80కి పెంచింది.

Gurukul Jobs: గురుకులాల్లో నియామకాలు చేపట్టాలి

పరీక్ష కేంద్రాలు

9వ, 11వ తరగతిల్లో ప్రవేశానికి ఒకే రోజు పరీక్ష ఉంటుంది. 9వ తరగతికి ఉదయం 11.15 నుంచి 1.45 వరకు మూడు కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. అలాగే 11వ తరగతికి ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు 4 కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది.

అబ్జ్‌క్టివ్‌ ప్రశ్నలు: 

11వ తరగతికి ఐదు విభాగాల్లో మెంటలెబులిటీ, ఇంగ్లిష్‌, సైన్సు, గణితం నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు అబ్జ్‌క్టివ్‌ టైపులో ఉంటాయి. అలాగే 9వ తరగతికి నాలుగు విభాగాల్లోని హిందీ, ఇంగ్లిష్‌, గణితం, జనరల్‌ సైన్సు నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులు అబ్జ్‌క్టివ్‌ టైపులో ఉంటాయి. రెండు పరీక్షలకు నెగటివ్‌ మార్కులు ఉండవు.

NTPC Recruitment 2024: 223 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో రాణించేలా..

హల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఈనెల 10న జరిగే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హల్‌టికెట్లను https:// navodaya.gov.inwww.nvsadmisspnclassnine.in నుంచి పొందవచ్చు. సందేహాలకు 08512–29454, 8074952380, 9985738899 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

Tenth Class Exams: ‘పది’లో సత్తా చాటుతాం

అత్యుత్తమ ప్రమాణాలు

సాధించడమే లక్ష్యం

విద్యాలయంలో అత్యుత్తమ విద్యాప్రమాణాల సాధన లక్ష్యంగా పటిష్ట విద్యా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. రిజర్వేషన్ల ప్రాతిపదికన 9వ, 11వ తరగతల్లో సీట్లను భర్తీ చేస్తాం. పైరవీరకు తావు ఉండదు. విద్యార్థులు కష్టపడి చదివితే సీటును సంపాదించుకోవచ్చు.

– ఇ.పద్మావతి, ప్రిన్సిపాల్‌, బనవాసి నవోదయ

                                              

Published date : 05 Feb 2024 04:21PM

Photo Stories