Gurukul Jobs: గురుకులాల్లో నియామకాలు చేపట్టాలి
Sakshi Education
మెదక్: నూతన నియమాకాలు చేపట్టే ముందే గురుకులాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రోగ్రెసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్ (పీఆర్‌జీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
ఫిబ్రవరి 4న పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పీఆర్‌జీటీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుకులాల ఉపాధ్యాయ, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ జనరల్ గురుకులాల పనివేళలు మార్చాలన్నారు. అన్ని గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలన్నారు.
చదవండి: Teacher Jobs: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు
317 జీఓ సమస్యను సత్వరం పరిష్కరించి అర్హులైన ఉద్యోగులందరికీ బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తగ్గించి, శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలన్నారు. పాఠశాలలకు శాశ్వత వసతి భవనాలు నిర్మించాలన్నారు. ఉపాధ్యాయులకు రాత్రివేళల్లో విధులను తప్పించి కేర్ టేకర్లను నియమించాలన్నారు. 010 ద్వారా వేతనాలు చెల్లించి టీఎస్‌జీఎల్‌ఐ వర్తింప జేస్తూ రెండో శనివారం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Published date : 05 Feb 2024 03:59PM