District Officers: విద్యతోనే వికాసం
నారాయణఖేడ్: విద్యతోనే వికాసం ఉంటుందని మహిళా, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారిణి సంధ్యారాణి తెలిపారు. జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం బేటీబచావో.. బేటీపడావో కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయ ని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాము ఉన్నత చదువులు చదువుతామని బాలిక లచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఖేడ్ మండ లం లింగాపూర్, ర్యాలమడుగు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ప్రీస్కూల్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నారు. ఖేడ్‌లో స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలిచ్చారు. సీడీపీవో సుజాత, ఎస్‌వో జ్యోతి, జిల్లా మహిళా సాధి కారిత కేంద్రం కోఆర్డినేటర్ పల్లవి పాల్గొన్నారు.
☛ Dr. BR Ambedkar University: నేటి నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు