DEO Inspection At School: డీఈఓ ఆకస్మిక తనిఖీ.. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
Sakshi Education
తాండూరు రూరల్: పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని చెంగోల్ జెడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
DEO Inspection At School
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పాటించని ఏజెన్సీలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పదోతరగతి విద్యార్థులను ప్రశ్నించి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయ బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆమె వెంట హెచ్‌ఎం పరా్‌ాశ్నయక్ ఉన్నారు.
మండల పరిధిలోని రాంపూర్ గేటు సమీపంలోని ఇంటర్నేషనల్ పాఠశాలలో నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(ఎన్‌ఏఎస్) పరీక్ష నిర్వహణపై డీఈఓ ఇన్విజిలేటర్లతో సమావేశమయ్యారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యంపై 3, 6, 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.