Skip to main content

Delhi IIT Student Suicide : ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య.. కార‌ణం ఇదేనా..?

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల ప‌రంప‌ర త‌గ్గ‌డం లేదు. కోచింగ్ సెంట‌ర్‌లోనో.. కాలేజీల్లోనో.. ఒత్తిడి త‌ట్టుకోలేక‌.. ఆత్మహత్య చేసుకోని శ‌వాల‌తో ఇంటికి వ‌చ్చి.. కన్నవాళ్ల‌కు క‌డుపు కోత మిగిలిస్తున్నారు. ఇలాంటి ఒత్తిడితో కూడిన చ‌దువుల‌తో.. ఎంద‌రో విద్యార్థుల‌కు బ‌లి అవుతున్నారు.
Delhi IIT Student Suicid Case News Today Telugu
Delhi IIT Student Suicid

తాజాగా ఐఐటీ-ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  అనిల్‌ మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌లో బీటెక్ చ‌దువుతున్నాడు. అతను క్యాంపస్‌లోని వింద్యాంచల్ హాస్టల్‌లో నివసిస్తున్నాడు. హాస్టల్‌ నిబంధనల ప్రకారం అనిల్‌ గత జూన్‌లో రూమ్‌ను ఖాళీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని  సబ్జెక్ట్‌లు తప్పడంతో అవి క్లియర్‌ చేసేందుకు మరో ఆరు నెలల సమయం ఇచ్చారు.

☛ Students Suicides : ఈ విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవ‌రిది..? కోచింగ్ సెంట‌ర్ల‌దా..? త‌ల్లిదండ్రుల‌దా..? ప్రభుత్వాలదా ?

ఈ క్రమంలో అనిల్‌ గురువారం గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు తిరిగి రాకపోవడంతో హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా. అనిల్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. అయితే సబ్జెక్టులు తప్పడంతోనే తీవ్ర ఒత్తిడికిలోనై ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. విద్యార్థి గ‌దిలో ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భ్యం కాలేదు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఐఐటీ-ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం గత రెండు నెలల్లో ఇది రెండో  ఘటన. జూలై 10న బీటెక్ (మ్యాథ్స్) చదువుతున్న ఆయుష్ అష్నా అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందాడు.

Published date : 02 Sep 2023 04:29PM

Photo Stories