Board Meeting: అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో విస్తృత చర్చ
సాక్షి ఎడ్యుకేషన్: నూతన విద్యావిధానం 2020పై విస్తృత చర్చ అవసరమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్ అన్నారు. వర్సిటీలో ఈ మేరకు 4,5 తేదీల్లో నూతన విద్యావిధానం అమలు, సవాళ్లు అంశంపై విద్యా విభాగం ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు చెప్పారు. నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఢిల్లీకి చెందిన ఇండియాన్ కౌన్సెల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ, సమగ్ర శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో ఈ సెమినార్ నిర్వహించనున్నట్లు వివరించారు.
Swachh Program: స్వచ్ఛ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సేవ
ప్రస్తుతం నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో 5 3 3 4 విధానంలో విద్య కొనసాగుతుందని చెప్పారు. ఎర్లీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ అమలు చేస్తామని అన్నారు. ఈ మేరకు సెమినార్‌కు 100 పరిశోధన పత్రాలు వచ్చాయని, ఈ పత్రాలతో సావనీర్ విడుదల చేస్తామని అన్నారు. సమావేశంలో సెమినార్ కన్వీనర్ డాక్టర్ హనుమంతు సుబ్రహ్మణ్యం, సహాయ కన్వీనర్ డాక్టర్ ఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు.