Skip to main content

BDS Seats Counselling : నవంబర్‌ 9 నుంచి 10 వరకు బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా వెబ్‌ కౌన్సెలింగ్‌

సాక్షి ఎడ్యుకేషన్‌ : బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నవంబర్‌ 9 నుంచి 10 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.

ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ నవంబర్‌ 8వ తేదీన (మంగళవారం) మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు దంత కళాశాలలలోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. 

తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు న మోదు చేసుకోవచ్చునని, కళాశాలల వారీగా సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని స్పష్టం చేసింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని పేర్కొంది. పూర్తి వివరాలకు  www.knruhs.telangana.gov.in చూడాలని సూచించింది.

Published date : 09 Nov 2022 07:15PM

Photo Stories