B Pharmacy Exams: ఏప్రిల్ 4 నుంచి బీఫార్మసీ మూడో సెమిస్టర్ పరీక్షలు..
Sakshi Education
కేయూ క్యాంపస్: కేయూ పరిధి బీఫార్మసీ (సీబీసీ ఎస్) మూడో సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 4 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహా చారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాధిక తెలిపారు. 4న పేపర్–1 ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, 6న పేపర్–2 ఫిజికల్ ఫార్మాస్యూ టిక్స్–1, 8న పేపర్–3 ఫార్మాస్యూటికల్ మైక్రోబ యాలజీ, 10న పేపర్–4 ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయన్నారు.
Published date : 02 Apr 2024 03:22PM