Food Manufacturers: ఆహార పదార్ధాల తయారీదారులకు అవగాహన కార్యక్రమం
మధురానగర్: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృష్ణాజిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గౌస్, ఫుడ్‌సేప్టీ ఆఫీసర్ శ్రీకాంత్, రమేష్‌బాబు ఆధ్వర్యంలో సోమవారం ఆహార పదార్థాల తయారీదారులకు ఫాస్టాక్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల తయారీ, శుభ్రత, విక్రయించే విధానం, వడ్డన విషయాలపై అవగాహన కల్పించారు.
Education Schemes: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆరోగ్యానందిస్తున్న ప్రభుత్వ పథకాలు
ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ ఇంక్యుబేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్‌స్కిల్ ట్రైనింగ్ ఫెడరేషన్(ఐఐఈఎస్‌టీ) రాష్ట్ర ప్రతినిధులు అబ్దుల్‌గఫార్, శ్రీపతి సురేష్, ట్రైనర్ యశోద తదితరులు పాల్గొని ఆహార పదార్థాల తయారీలో పాటించాల్సిన మెలకువలపై తయారీదారులకు శిక్షణ ఇచ్చారు. ఆహార పదార్థాల తయారీ విధానంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. తయారీ, ప్యాకింగ్ విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ICI Ultratech Award: భావి ఇంజనీర్లకు మార్గదర్శకంగా తేజ డిజైన్లు
చేతులకు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల శంకర్రావు, ప్రధాన కార్యదర్శి కాకు మల్లికార్జునరావు, నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పాల్గొన్నారు.