AP School Reforms: 310 పాఠశాలల్లో 1,330 అదనపు తరగతి గదులు!
కర్నూలు(సెంట్రల్): ఆగస్టు నెలాఖరుకు 310 పాఠశాలల్లో 1,330 అదనపు తరగతి గదులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ జి.సృజన సూచించారు. రన్నింగ్ వాటర్, కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, విద్యుత్ ఇతర మౌలిక సదుపాయల కల్పన పనులను నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
AP CM YS Jagan Mohan Reddy : విద్యావ్యవస్థలో 'ఏఐ' భాగం కావాలి.. ఎందుకంటే..
గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో విద్యాశాఖకు సంబంధించి మనబడి నాడు–నేడు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు–నేడు పనులకు నిధుల కొరత లేదన్నారు. హెచ్‌ఎం కమిటీ అకౌంట్‌లో రూ.20 కోట్లు ఉన్నట్లు చెప్పారు. పనులను వేగవంతం చేసి పూర్తయిన వాటికి బిల్లులు చేసేందుకు అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
నాలుగు పాఠశాలల్లో విద్యుదీకరణ పనులు పూర్తి కాకున్నా.. అయినట్లు ఫొటోలను అప్‌లోడ్ చేసిన ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని పీఆర్ ఎస్‌ఈ సుబ్రమణ్యంను ఆదేశించారు. తడకనపల్లె పాఠశాలలో టాయిలెట్లు మరమ్మతుల కోసం అనుమతులు తీసుకొని కొత్త వాటిని నిర్మిస్తుండడంతో వివరణ తీసుకోవాలని సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ వేణుగోపాల్‌ను ఆదేశించారు.
అక్టోబర్ 2 నాటికి అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి చేయాలి
నాడు–నేడులో భాగంగా నిర్మిస్తున్న 81 అంగన్‌వాడీ కేంద్రాలను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదేశించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 31, పీఆర్‌లో 17, ఆర్‌డబ్ల్యూఎస్‌లో 16, ఏపీఈడబ్ల్యూఐడీసీలో 16, పీహెచ్‌ఈడీలో ఒకటి మొత్తం 81 అంగన్‌వాడీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. పాత అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్లను వెంటనే నిర్మించాలన్నారు. పూర్తయిన అంగన్‌వాడీలకు నీటి సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఏపీఈడబ్ల్యూడీసీ ఎస్‌ఈ మనోహర్, ఐసీడీఎస్ పీడీ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
Special Story: ఆ ఊరు ఊరంతా యూట్యూబర్సే... నెలకు లక్షల్లో సంపాదిస్తున్న గ్రామస్తులు... ఎక్కడంటే..