AP PGCET-2023: నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
తిరుపతి సిటీ: ఏపీ పీజీసెట్–2023లో ర్యాంకు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శనివారం నుంచి జరుగుతుందని ఎస్వీయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ మురళి తెలిపారు. ఎస్వీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందనున్న విద్యార్థులకు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలనతోపాటు ఫీజు చెల్లింపు ప్రక్రియ జరుగుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని స్టేట్ బ్యాంకు భవనం మొదటి అంతస్తులో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్టు చేయాలని సూచించారు.
చదవండి: Mini Job Mela: నిరుద్యోగులకు అక్టోబర్ 10న మినీ జాబ్ మేళా
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: గుర్తింపు కార్డుల కోసం రంగస్థల కళాకారులు అక్టోబర్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి ఏ.బాలకొండయ్య అక్టోబర్ 6 శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో అక్టోబర్ 7వ తేదీ వరకు మాత్రమే గడువు ఇచ్చారని చెప్పారు. తాజాగా 8వ తేదీ వరకు పొడిగించారని స్పష్టం చేశారు. అర్హులైన కళాకారులు కళాకారుని పేరు, జెండర్, బ్లడ్ గ్రూపు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, చిరునామా, జిల్లా, కళారూపం, అనుభవం, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ తదితర వివరాలను నమోదు చేయాలన్నారు. సంబంధిత జెరాక్స్‌లతోపాటు తహసీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణపత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయంలోని ఏ బ్లాక్‌లోని 4వ అంతస్తులో ఉన్న పౌరసంబంధాలశాఖ కార్యాలయంలో 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం 8897604650 నంబర్‌లో సంప్రదించాలని చెప్పారు.