Centurion School: జేఈఈ, ఐఐటీకి ఎంపికైన సెంచూరియన్ స్కూల్ విద్యార్థులు
పర్లాకిమిడి: సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ నుంచి ఐఐటీకి సెలక్టయ్యే విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలని సీఈవో ఎ.బలరామన్ అన్నారు. స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవాన్ని శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు మాట్లాడుతూ సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ నుంచి ఈ ఏడాది ఆరుగురు విద్యార్థులు జేఈఈ, ఐఐటీకి ఎంపికయ్యారన్నారు.
Engineering College Annual Day: ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా 47వ వార్షికోత్సవ వేడుకలు..
సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి తొలుత వార్షిక పట్టికను చదవగా, వర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో ముఖ్య అతిథి ఎ.బలరామన్‌ను సత్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Model School Entrance Exam: నేడు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహణ