Archery: ఆర్చరీలో విశ్వకవి విద్యార్థుల ప్రతిభ
Sakshi Education
సాక్షి, భీమవరం: ఆర్చరీ పోటీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ సాధించడంతోపాటు మూడు క్యాటగిరీల్లోనూ గోల్డ్ మెడల్స్ సాధించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
విశ్వకవి స్కూల్ విద్యార్థులు ఎం.సుహాస్, గుంజన్ శర్మ ఇటీవల డెహ్రాడూన్‌లో నిర్వహించిన పోటీల్లో మెడల్స్ సాధించడంపై సోమవారం ఎమ్మెల్యే అభినందించారు. స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ సుహాన్ ఆర్చరీలో ఆల్ ఇండియా ప్రథమస్థానంలో నిలవగా నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ పోటీలలో గుంజన్ శర్మ జిల్లా స్థాయిలో ప్రథమస్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. అనంతరం స్కూల్ తరపున సుహాస్‌కు రూ.50 వేలు శర్మకు రూ.10 వేలు నగదు బహుమతులను శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ప్రిన్సిపాల్ పూజిత, హెచ్‌ఎం రఘురాం, ఇన్‌చార్జి ప్రశాంతి, ప్రాజెక్ట్ గైడ్ ప్రకాష్, ఆర్చరీ కోచ్ సాహిత్ పాల్గొన్నారు.
Also read:
Published date : 14 Nov 2023 02:21PM