Children's Future: చిన్నారుల ‘భవిత’కు బంగారు బాట
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ప్రత్యేకంగా ఫిజియోథెరపీ సేవలు..
● విభిన్న ప్రతిభావంతులకు
● 30 భవిత కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ
● వారి చదువుకు, ప్రయాణానికి, సంరక్షకులకు ప్రత్యేక అలవెన్సులు
● పర్యవేక్షిస్తున్న సమగ్ర శిక్షా అధికారులు
శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విభిన్న ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రభుత్వం భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టులను నియమించింది. మరికొంత మంది చిన్నారులు ఇల్లు కదల్లేని పరిస్థితుల్లో ఉంటే, వారానికోసారి సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి అక్కడే ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు. గృహ ఆధారిత విద్య ద్వారా ఇలాంటి చిన్నారుల్లో శారీరక, మానసిక పరివర్తన తీసుకువచ్చేందుకు ఫిజియోథెరపీ సేవలు ఎంతో ఉపకరిస్తున్నాయి.
Published date : 24 Jul 2023 04:26PM