Skip to main content

New Scheme for Anganwadi: అంగ‌న్వాడీ కేంద్రాల్లో నాడు-నేడు ప‌థ‌కం

జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ నాడు నేడు ప‌థ‌కంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగ‌న్వాడీ కేంద్రాల్లో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌త్తులను, త‌గిన చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం అంగ‌న్వాడీలో ఏర్పాటు చేయ‌నున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. ఈ నాడు-నేడు ప‌థ‌కానికి సంబంధించి పూర్తి వివ‌రాలు..
 Nadu-Nedu Scheme, Day-to-Day Scheme Updates, Anganwadi Centers gets new scheme, Government Programs in Anganwadi
Anganwadi Centers gets new scheme

సాక్షి ఎడ్యుకేష‌న్: అంగన్వాడీ కేంద్రాలలో ఆధునిక సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహ్లాదకర వాతావరణంలో ఆటపాటలతో కూడిన విద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మత్తులు, అవసరమైన చోట నూతన భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. గర్భిణులు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా 12 ప్రాజెక్టుల పరిధిలో 2389 అంగన్వాడీ కేంద్రాలున్నాయి.

Nobel Prize in Chemisty 2023: రసాయన శాస్త్రంలో నోబెల్ గ్ర‌హీత‌లు వీరే...

వాటిలో గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వడంతోపాటు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కనీస మరమ్మత్తులకు నోచుకోని కేంద్రాలకు నాడు–నేడు పథకం కింద రెండో దశలో 80 అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఒక్కో భవనానికి ప్రభుత్వం రూ. 13.50 లక్షలు వెచ్చిస్తోంది. ఇందులో రూ.10 లక్షలు భవన నిర్మాణానికి, రూ. 2.80 లక్షలు విద్యుత్తు, నీటి సౌకర్యం, ఫర్నిచర్కు, రూ.30 వేలు మరుగుదొడ్లు, ఇతర పనులకు కేటాయించనున్నారు. భవనాల స్థాయి పెంచేందుకు ఒక్కో కేంద్రానికి రూ. 5.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు.

Written Exams for SI Posts: ఎస్ఐ పోస్టుల‌కు తుది ద‌శ ప‌రీక్ష‌లు

ఏడుగురు సభ్యులతో కమిటీ

భవన నిర్మాణ పనుల్లో పారదర్శకతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పర్యవేక్షణ మొదలు నిధుల వినియోగం వరకు కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, సభ్యులుగా అంగన్వాడీ టీచర్‌, గ్రామ, వార్డు, మహిళా పోలీస్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌తోపాటు చిన్నారుల తల్లులు ముగ్గురుంటారు. కమిటీ పేరిట బ్యాంకు ఖాతా తెరిచి ఇద్దరికి చెక్‌ పవర్‌ ఇవ్వనున్నారు. బాల్య దశలోనే చిన్నారికి విజ్ఞానం పెంపొందించడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనేక చర్యలు చేపట్టింది. ఈసీసీఈ (ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌) పథకం కింద మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు సమగ్ర వికాసమే ధ్యేయంగా పలు కార్యక్రమాలను రూపొందించింది. బాలల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు పీపీ-1, పీపీ–2 పుస్తకాల ద్వారా ఆంగ్ల పదాల బోధన సాగుతోంది. ఆటపాటలతో చదువులు కొనసాగేలా అనేక చర్యలు చేపట్టింది. కేంద్రాల్లో 15 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Medical College: వైద్య విద్యకు శ్రీకారం.. 30 ఎకరాల్లో.. రూ.180 కోట్లు

పోషకాహారంతో రక్తహీనతకు చెక్‌

అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా నాణ్యమైన సరకులను అందిస్తున్నారు. పోషకాహారం ద్వారా రక్తహీనతకు చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. శుచి, శుభ్రతతోపాటు ముఖ్యమంత్రి పోషకాహారాన్ని అందించడం సంతోషంగా ఉంది. 
  
   – ఈశ్వరమ్మ, గర్భిణి, కడప

Jobs Through CPET: యువ‌త‌కు సీపెట్ ద్వారా ఉద్యోగాలు

పారదర్శకంగా సేవలు

అంగన్వాడీ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించింది. ఫేస్‌యాప్‌ ద్వారా లబ్ధిదారులకు సరుకు అందిస్తున్నాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పంపిస్తున్నారు.
 
  – ఎన్‌.వినీలగ్లోరి, అంగన్వాడీ కార్యకర్త, కడప
 

Published date : 05 Oct 2023 12:43PM

Photo Stories