Admissions Open In Yogi Vemana University-వైవీయూలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
Sakshi Education
యోగివేమన విశ్వవిద్యాలయంలో జర్నలిజం, లలితకళల విభాగంలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ఈనెల 9,10, 11,12 తేదీల్లో నేరుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య కె. గంగయ్య తెలిపారు. జర్నలిజంశాఖ ఆధ్వర్యంలో పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్, పీజీ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్‌శాఖ ఆధ్వర్యంలో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రవేశాలకు వాళ్లు అర్హులు
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులన్నారు. ఈ కోర్సులు పూర్తిగా సాయంత్రం నిర్వహించనున్న నేపథ్యంలో వైవీయూ పీజీ విద్యా ర్థులు, పరిశోధక విద్యార్థులు కూడా చేయవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైవీయూఈడీయూ.ఇన్ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
Published date : 06 Jan 2024 03:10PM