Admissions: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
![Admissions in ITI colleges](/sites/default/files/images/2023/09/16/admissions-iti-1694856856.jpg)
షాద్‌నగర్: ఐటీఐలో ప్రవేశాల కోసం నాలుగో విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు షాద్‌నగర్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ ఆదేశాల మేరకు ఆగస్టు 2023 సెషన్ కోసం ఎన్‌సీవీటీ ప్యాట్రన్ కింద వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పొందేందుకు నాలుగో విడత ఽవిద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు అడ్మిషన్లు నిర్వహించనున్న ట్లు వెల్లడించారు. విద్యార్థులు దరఖాస్తుతో పా టు ఎస్‌ఎస్‌సీ మెమో, కులధ్రువీకరణ పత్రం, పదో తరగతి వరకు బోనఫైడ్, టీసీ, ఆధార్‌కార్డుతో హాజరు కావాలని సూచించారు.
Published date : 16 Sep 2023 03:04PM