Skip to main content

TS ITI Admissions 2023: ఐటీఐ కళాశాలల్లో మిగిలిన సీట్లకు నాలుగవ విడత ప్రవేశాలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

Admissions in ITI colleges

భూపాలపల్లి అర్బన్‌: ఐటీఐ కళాశాలల్లో మిగిలిన సీట్లకు నాలుగవ విడత ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని 23వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో విద్యార్హత ధృవీకరణ పత్రాలను కళాశాలలో అందజేయాలని సూచించారు.

శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్ష
భూపాలపల్లి అర్బన్‌: వృత్తి విద్య కోర్సులలో శిక్షణ పొందిన అభ్యర్థులకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జ్‌ సేవా అధ్యక్షురాలు బండి వనజ వెంకటయ్య హాజరై అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవాసమితి కోఆర్డినేటర్‌ శివకుమార్‌, జీఎం సీఎన్‌డీ నరేష్‌, అధికార ప్రతినిధి తుకారాం, లేడిస్‌క్లబ్‌ కార్యదర్శి రమణివెంకటరామిరెడ్డి, అధికారులు రాజశేఖర్‌, శ్యామ్‌ప్రసాద్‌, సేవా కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌, కార్యదర్శి లక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.

Published date : 16 Sep 2023 02:50PM

Photo Stories