Skip to main content

Formation Day: ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సైనిక పాఠశాల..!

ఉత్సాహంగా జరుపుకున్న సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రిన్సిపాల్‌ మాటలు..
Army School principal S S Shastri about the school formation    Korukonda Military School celebrates its 62nd Foundation Day with pride and honor.

కోరుకొండ సైనిక పాఠశాల 62వ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ప్రిన్సిపాల్‌, గ్రూప్‌ కెప్టెన్‌ ఎస్‌.ఎస్‌.శాస్త్రి కేక్‌ కట్‌చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు దేశ రక్షణ రంగంలో సుమారు 700 మంది సైనిక అధికారులను అందించిన ఘనత కోరుకొండ సైనిక పాఠశాలకు దక్కడం గర్వకారణమన్నారు.

School Admissions: మరో విద్యాసంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం..

సైనిక పాఠశాలలో విద్యనభ్యశించిన వేలాది మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా నేడు అత్యున్నత స్థాయిలో ఉన్నారని కొనియాడారు. దేశంలో ఉన్న 33 సైనిక పాఠశాలలో కోరుకొండ సైనిక పాఠశాల ముందు వరుసలో నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు. సౌకర్యాలు, శిక్షణ పరంగా, ఉత్తమ విద్యాభోదన అందించడంలో పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. భవిష్యత్తులో సైనిక పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Published date : 20 Jan 2024 10:37AM

Photo Stories