ICAI Placement Program : ఈ ప్లేస్‌మెంట్‌లో తొలిసారి 241 కంపెనీలు.. ఎంపికైనావారు!
సాక్షి ఎడ్యుకేషన్: ఐసీఏఐ సీఏ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అదరగొట్టారు. 2024-25 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా కొన్ని నగరాల్లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఏకంగా 8వేల మందికి పైగా విద్యార్థులు కొలువులు దక్కించుకున్నారు.
241 కంపెనీలు..
ఈ క్యాంపస్ ప్లేస్మెంట్‌లను నవంబర్ 2023, మే 2024 పరీక్షల్లో కొత్తగా అర్హత పొందిన సీఏ ల కోసం నిర్వహించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు మొత్తం రెండు వితగలుగా ఈ ప్లేస్‌మెంట్‌ను నిర్వహించారు. ఫిబ్రవరి-మార్చి 2024లో జరిగిన 59వ క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో 140 కంపెనీలు పాల్గొనగా 3,002 మంది అభ్యర్థులు కొలువులు సాధించారు.
CA Final Exam Results 2024 : సీఏ తుది పరీక్ష ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీరే..!
మే-జూన్‌లో జరిగిన 60వ ప్రోగ్రామ్‌లో 4,782 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 241 కంపెనీలు ఈ సెలక్షన్ ప్రోగ్రామ్ చేపట్టాయి. ఐసీఏఐ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో 4782 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ తెలిపారు. జాబ్ మార్కెట్లో సీఏలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఈ గణాంకాలే నిదర్శనమన్నారు.
సీఏల వేతనం..
ఎంపికైన విద్యార్ధుల్లో రూ. 29 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో డియాజియో ఇండియా నుంచి జాబ్ ఆఫర్‌ను అందుకున్నారు. ఆ తర్వాత రూ.26.70 లక్షల వేతనంతో ఎల్‌పీఏ కంపెనీ అత్యధిక ప్యాకేజీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే సగటు వేతనం మాత్రం రూ. 13.24 లక్షల వార్షిక వేతనం నుంచి రూ. 12.49 లక్షల వార్షిక వేతనానికి స్వల్పంగా తగ్గిందని ధీరజ్ ఖండేల్వాల్ తెలిపారు. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు తొమ్మిది ప్రధాన నగరాలతో పాటు 20 చిన్న చిన్న నగరాల్లోనూ ఈ డ్రైవ్‌లు నిర్వహించారు.
తొలిసారిగా..
సాధారణంగా ఐసీఏఐలో ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు 150 కంపెనీలే పాల్గొంటుండేవని అధికారులు తెలిపారు. కాని, ఈ ఏడాది మాత్రం అత్యధికంగా కంపెనీలు పెరగడం విశేషం. ఇక్కడ ఏకంగా 241 కంపెనీలు ప్లేస్‌మెంట్‌లలో పాల్గొనడం తొలిసారి జరిగందన్నారు. ఇదిలా ఉంటే, మరోవైపు.. వచ్చే ఏడాది జనవరి 24-25 తేదీల్లో ఓవర్సీస్ ప్లేస్‌మెంట్స్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు ఐసీఏఐ సన్నాహాలు చేస్తోంది. యూఏఈ, ఆసియా, యూరప్ సహా పలు దేశాలకు సీఏలను పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మంది సభ్యులు, దాదాపు 9,85,000 మంది విద్యార్థులతో ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, US వంటి ప్రాంతాలలో ICAI 52 విదేశీ అధ్యాయాలను కలిగి ఉంది. భారతీయ CAలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేలా చేయడమే ఐసీఏఐ ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ICAI
- ca students
- rankers
- Campus Placement
- students selections
- campus placements for ca students
- chattered accountants
- ca students
- annual income for ca
- icai history
- 241 companies
- icai campus placements
- campus placement drive
- ca students in icai campus placements
- 150 placements
- Mumbai
- Delhi
- benglore
- CA Rankers
- Education News
- Sakshi Education News
- ICAI Education and Placement programs
- january 2025
- Africa
- foreign education