Skip to main content

SSC Jobs: పదో తరగతి పాస్ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ కొలువు

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసుకొని.. కేంద్ర ప్రభుత్వ కొలువు కొట్టాలనుకునే వారికి శుభవార్త. కేంద్ర పబ్లిక్, పర్సనల్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా వేర్వేరు విభాగాల్లో మొత్తం 3261 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ భర్తీ చేసే పోస్టులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, సిలబస్‌ అంశాలపై ప్రత్యేక కథనం..
Staff Selection Commission Recruitment for 10th pass students
Staff Selection Commission Recruitment for 10th pass students

మొత్తం పోస్టుల సంఖ్య: 3261
పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, రీసెర్చ్‌ అసిస్టెంట్, గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్, కెమికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజనీర్, సైంటిఫిక్‌ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్‌ అటెండెంట్, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులున్నాయి.
అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఆపై విద్యార్హతల్లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు:పోస్టులను అనుసరించి 18–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ–5ఏళ్లు,ఓబీసీలకు 3ఏళ్లు వయో సడలింపు లభిస్తుంది.

చ‌దవండి: Staff Selection Commission: 3261 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌... దరఖాస్తు వివరాలు ఇలా..

ఎంపిక ప్రక్రియ

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. విద్యార్హత, పోస్టులను బట్టి మూడు వేర్వేరు సీబీటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల కోత విధిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారిని స్కిల్‌ టెస్ట్‌కు పిలుస్తారు.

సిలబస్‌ విశ్లేషణ

పోస్టులు, అర్హతలకు అనుగుణంగా ఆయా స్థాయి ప్రశ్నలు అడుగుతారు. జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.

పదోతరగతి స్థాయి పోస్టులకు సిలబస్‌

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌: ఈ విభాగం నుంచి 50 మార్కులకు–25 ప్రశ్నలుంటాయి. అభ్యర్థి విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే వి«ధంగా ప్రశ్నలను అడుగుతారు. ఇందులో స్పేస్‌ విజువలైజేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, అనాలసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్‌ మేకింగ్, విజువల్‌ మెమొరీ, డిస్క్రిమినేటింగ్‌ అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్స్, ఫిగర్‌ క్లాసిఫికేషన్, అర్థమెటికల్‌ నంబ ర్‌ సిరీస్, నాన్‌ వెర్బల్‌ సిరీస్‌ తదితర అంశాలు నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
  • జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగం నుంచి 50మార్కులకు–25 ప్రశ్నలుంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలు అభ్యర్థి జనరల్‌ అవేర్‌నెస్, పర్యావరణం–సమాజంలో దాని అనువర్తనాలపై అభ్యర్థులకున్న అవగాహను పరీక్షించేలా ఉంటాయి. కరెంట్‌ అఫైర్స్, పొరుగు దేశాలతో భారత్‌ సంబంధాలు, స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్‌ పాలిటీ, భారత రాజ్యాంగం, సైంటిఫిక్‌ రీసెర్చ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌: ఈ విభాగం నుంచి 50 మార్కులకు–25 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నంబర్‌ సిస్టమ్, కంప్యూటేషన్‌ ఆఫ్‌ హోల్‌ నంబర్స్, డెసిమల్స్‌ అండ్‌ ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధాలు, అర్థమెటిక్‌ ఆపరేషన్స్‌–ప్రాథమిక అంశాలు, పర్సంటేజెస్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, సగటు, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్, టేబుల్‌–గ్రాఫ్స్‌ ఉపయోగాలు, మెన్సురేషన్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, రేషియో అండ్‌ టైమ్, టైమ్‌ అండ్‌ వర్క్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగం నుంచి 50 మార్కులకు–25 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థుల ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. వొకాబ్యులరీ,గ్రామర్,సెంటెన్స్‌ కరెక్షన్స్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, యూసేజ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.

ఇంటర్‌ లెవల్‌ పరీక్ష సిలబస్‌

జనరల్‌ ఇంటెలిజెన్స్‌: ఈ విభాగం నుంచి 50 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. వెర్బల్‌–నాన్‌ వెర్బల్‌ తరహా ప్రశ్నలను అడుగుతారు. ఇందులో సెమటిక్‌ అనలాజీ, సింబాలిక్‌ ఆపరేషన్, సింబాలిక్‌/నంబర్‌ అనలాజీ, ట్రెండ్స్, ఫిగరల్‌ అనలాజీ, స్పేస్‌ ఓరియంటేషన్, సెమాంటిక్‌ క్లాసిఫికేషన్, వెన్‌ డయాగ్రమ్స్, సింబాలిక్‌/నంబర్‌ క్లాసిఫికేషన్, డ్రాయింగ్‌ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్‌ క్లాసిఫికేషన్, పంచ్‌డ్‌ హోల్‌/ప్యాట్రన్‌– ఫోల్డింగ్‌ అండ్‌ ఫోల్డింగ్, సెమటిక్‌ సిరీస్, ఫిగరల్‌ ప్యాటర్న్, నంబర్‌ సిరీస్, ఎంబెడెడ్‌ ఫిగర్స్, ఫిగరల్‌ సిరీస్, క్రిటికల్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, వర్డ్‌ బిల్డింగ్, సోషల్‌ ఇంటెలిజెన్స్, కోడింగ్‌–డికోడింగ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

  • జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగం నుంచి 50 మార్కులకు–25 ప్రశ్నలుంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలు సమాజం పట్ల అభ్యర్థులకు ఉన్న అవగాహను పరీక్షించే విధంగా ఉంటాయి. సమాజంలో రోజు వారి జరిగే సంఘటనలు, పర్యావరణం, జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశాలుంటాయి. అలాగే స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, భారత రాజ్యాంగం, సైంటిఫిక్‌ రీసెర్చ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌: ఈ విభాగంలో 50 మార్కులకు–25 ప్రశ్నలు ఉంటాయి. నంబర్‌ సిస్టమ్, కంప్యూటేషన్‌ ఆఫ్‌ హోల్‌ నంబర్, డెసిమల్స్‌ అండ్‌ ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్‌ బిట్‌విన్‌ నంబర్స్, ఆర్థమెటికల్‌ ఆపరేషన్స్‌ ప్రాథమిక అంశాలు, పర్సంటేజెస్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, సగటు, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్, టేబుల్, గ్రాఫ్స్‌తో ప్రయోజనాలు, మెన్సురేషన్, కాలం–దూరం, రేషియో అండ్‌ టైమ్, కాలం–పని తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. వీటితోపాటు అల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రి వంటి టాపిక్స్‌ నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశముంది.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగంలో 50 మార్కులకు–25 ప్రశ్నలు ఉంటాయి. స్పాట్‌ ది ఎర్రర్స్, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్, సినానిమ్స్‌/హోమోనిమ్స్, ఆంటోనియమ్స్, స్పెల్లింగ్స్‌/ డిటెక్టింగ్‌ మిస్‌ స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, వన్‌ వర్డ్‌ సబ్స్‌స్ట్యూషన్స్, ఇంప్రూవ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్స్, యాక్టివ్‌ అండ్‌ పాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌–ఇన్‌డైరెక్ట్‌ నారేషన్, షఫ్లింగ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ ఇన్‌ పార్ట్స్, షఫ్లింగ్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ ఇన్‌ ప్యాసెజ్, క్లోజ్‌ ప్యాసెజ్, కాంప్రహెన్షన్‌ ప్యాసెజ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

గ్రాడ్యుయేషన్, ఆపై స్థాయి పరీక్ష సిలబస్‌

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ (50 మార్కులు–25 ప్రశ్నలు): ఈ విభాగంలో వెర్బల్‌–నాన్‌ వెర్బల్‌ అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. అనాలజీస్,సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సస్, స్పేస్‌ విజువలైజేషన్,స్పేషియల్‌ ఓరియంటేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్,అనాలసిస్,జడ్జ్‌మెంట్, డెసిషన్‌ మేకింగ్, విజువల్‌ మెమొరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్, అర్థమెటికల్‌ రీజనింగ్, ఫిగరల్‌ క్లాసిఫికేషన్, అర్థమెటిక్, నంబర్‌ సిరీస్, నాన్‌ వెర్బల్‌ సిరీస్, కోడింగ్‌–డీకోడింగ్, స్టేట్‌మెంట్‌ కన్‌క్లూజన్,సిలోజిస్టిక్‌ రీజనింగ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు.
  • జనరల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు–25 ప్రశ్నలు): ఈ విభాగంలో పర్యావరణ అంశాలు, సమాజంపై అభ్యర్థులకున్న అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. దాంతోపాటు కరెంట్‌ అఫైర్స్, పొరుగు దేశాలతో భారత్‌ సంబంధాలు, క్రీడలు, హిస్టరీ, కల్చర్, ఎకానమీ, పాలిటీ, సైంటిఫిక్‌ రీసెర్చ్‌ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ (50 మార్కులు–25 ప్రశ్నలు): ఈ విభాగంలో నంబర్స్‌ సరిగా ఉపయోగించగల సామర్థ్యాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలుంటాయి. నంబర్‌ డెసిమల్స్, ఫ్రాక్షన్స్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ బిట్‌విన్‌ నంబర్స్, పర్సంటేజెస్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, స్క్వేర్‌ రూట్స్, సగటు, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్, భాగస్వామ్య వ్యాపారం, మిక్చర్‌ అండ్‌ అలిగేషన్,కాలం–దూరం, టేబుల్స్, గ్రాఫ్స్‌తో ప్రయోజనాలు, మెన్సురేషన్, రేషియో అండ్‌ టైమ్, కాలం–పని తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. అలాగే అల్జీబ్రా, జామెట్రీ,మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రి సంబంధిత అంశాలపైనా ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25.10.2021
సీబీటీ(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) పరీక్ష తేది: జనవరి/ఫిబ్రవరి 2022

వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Published date : 05 Oct 2021 05:31PM

Photo Stories