Skip to main content

తెలంగాణ - ఉనికి, నైసర్గిక స్వరూపం

తెలంగాణ రాష్ట్రం 15°55' నుంచి 19° 56' ఉత్తర అక్షాంశాలు, 77° 15' నుంచి 80° 47' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. రాష్ట్ర వైశాల్యం 1,14,840 చ.కి.మీ. ఇది భారతదేశ విస్తీర్ణంలో దాదాపుగా 3.49 శాతం. విస్తీర్ణపరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది.

రాష్ట్ర సరిహద్దులు
తెలంగాణ రాష్ట్రానికి తూర్పు, దక్షిణ సరిహద్దుగా ఆంధ్రప్రదేశ్, ఈశాన్య సరిహద్దుగా ఛత్తీస్‌గఢ్, ఉత్తర, వాయవ్య సరిహద్దుగా మహారాష్ట్ర, పశ్చిమ సరిహద్దుగా కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.

జిల్లాలు - సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం
1) మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం - ఆంధ్రప్రదేశ్
2) మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ - కర్ణాటక
3) ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ - మహారాష్ట్ర
4) ఖమ్మం, వరంగల్, కరీంనగర్ - ఛత్తీస్‌గఢ్

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పశ్చిమ పీఠభూమి (దక్కన్ పీఠభూమిలోని భాగం) పరిధిలో ఉన్నాయి. ఇది పురాతనమైన పెనిప్లేన్, గోండ్వానా శిలలతో కూడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆర్కియన్, నైస్, గ్రానైట్ శిలలున్నాయి.
పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలు అజంతా శ్రేణి నుంచి విడిపోయి ఆగ్నేయ దిశగా తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తున్నాయి. అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు విస్తరించాయి. ఈ పర్వతాలను వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు.
తూర్పు కనుమలు రాష్ట్రంలోకి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశిస్తున్నాయి. వీటిని రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు.

మాదిరి ప్రశ్నలు

  1. కిందివాటిలోఏ రాష్ట్రం తెలంగాణతో సరిహద్దును పంచుకోవడం లేదు?
    1) ఛత్తీస్‌గఢ్
    2) మధ్యప్రదేశ్
    3) మహారాష్ట్ర
    4) కర్ణాటక
  2. విస్తీర్ణపరంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
    1) 8
    2) 5
    3) 13
    4) 12
  3. తెలంగాణలోని ఏయే జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి?
    1) రంగారెడ్డి, మెదక్, వరంగల్
    2) రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్
    3) మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం
    4) ఖమ్మం, వరంగల్, కరీంనగర్
  4. కిందివాటిలో ఏ జిల్లా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును కలిగి లేదు?
    1) కరీంనగర్
    2) హైదరాబాద్
    3) రంగారెడ్డి
    4) నిజామాబాద్
  5. తెలంగాణ రాష్ట్రం ఏయే ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
    1) 14°15' - 19° 55'
    2) 16° 55' - 20° 56'
    3) 15° 55' - 19° 56'
    4) 13° 15' - 18° 55'
  6. తెలంగాణ రాష్ట్రంలో అధిక వైశాల్యం ఉన్న మొదటి మూడు జిల్లాలు వరుసగా?
    1) మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం
    2) ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్
    3) మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలాబాద్
    4) ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం
  7. రాష్ట్రంలో అతి తక్కువ వైశాల్యం ఉన్న చివరి మూడు జిల్లాలు వరుసగా?
    1) హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి
    2) రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్
    3) హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్
    4) రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్
  8. తెలంగాణకు పశ్చిమ సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది?
    1) ఛత్తీస్‌గఢ్
    2) ఆంధ్రప్రదేశ్
    3) కేరళ
    4) కర్ణాటక
  9. కింద పేర్కొన్న ఖమ్మం జిల్లాలోని మండలాల్లో దేన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపలేదు?
    1) కుక్కనూరు
    2) చింతూరు
    3) వెంకటాపురం
    4) వేలేరుపాడు
  10. తెలంగాణలో అత్యధిక మండలాలున్న జిల్లా ఏది?
    1) రంగారెడ్డి
    2) మహబూబ్‌నగర్
    3) నల్గొండ
    4) ఆదిలాబాద్
  11. తూర్పు కనుమలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తున్నాయి?
    1) ఆదిలాబాద్
    2) నల్గొండ
    3) మహబూబ్‌నగర్
    4) ఖమ్మం
  12. కరీంనగర్ జిల్లాలో పశ్చిమ కనుమలను ఏ పేరుతో పిలుస్తారు?
    1) కందికల్ గుట్టలు
    2) పాపికొండలు
    3) నిర్మల్ గుట్టలు
    4) రాఖీ గుట్టలు
  13. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన‌ జలపాతం ‘కుంతాల’ ఏ నదిపై ఉంది?
    1) ప్రాణహిత
    2) కడెం
    3) మంజీరా
    4) భీమా
  14. వరంగల్ జిల్లాలో పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు?
    1) రాఖీ గుట్టలు
    2) నిర్మల్ గుట్టలు
    3) కందికల్ గుట్టలు
    4) అనంతగిరి గుట్టలు
  15. సిర్నాపల్లి పంక్తులు విస్తరించి ఉన్న జిల్లా ఏది?
    1) ఖమ్మం
    2) నల్గొండ
    3) ఆదిలాబాద్
    4) నిజామాబాద్
  16. ఉత్తర తెలంగాణలోని గోండ్వానా శిలల్లో ప్రధానంగా లభించే ఖనిజం ఏది?
    1) ముడి చమురు
    2) మాంగనీస్
    3) బొగ్గు
    4) ముడి ఇనుము

సమాధానాలు

1) 2

2) 4

3) 3

4) 2

5) 3

6) 1

7) 3

8) 4

9) 3

10) 2

11) 3

12) 4

13) 2

14) 3

15) 4

16) 3

Published date : 07 Sep 2015 05:07PM

Photo Stories