ప్రాథమిక హక్కులు - ముఖ్య వివాదాలు
ఎ.కె. గోపాలన్ V/s మద్రాస్ స్టేట్ (1950): 1950లో చేసిన నివారక నిర్బంధ చట్టం (ప్రివెన్షివ్ డిటెన్షన్ యాక్ట్)లోని సెక్షన్ 4 న్యాయ సమీక్షాధికారానికి విరుద్ధంగా ఉన్నందున అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ చట్టం కింద ముందస్తు అరెస్టు సమంజసమేనని పేర్కొంది.
శంకరి ప్రసాద్ V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1951): మొట్టమొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాన్ని ఈ వివాదంలో సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ సవరణ రాజ్యాంగబద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.
బేలా బెనర్జీ V/s పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (1953): ప్రజల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది.
సజ్జన్ సింగ్ V/s రాజస్థాన్ (1964): ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ అధికారానికి సంబంధించిన వివాదాన్ని పరిశీలించింది. ఆస్తి హక్కుకు సంబంధించి చేసిన 17వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమేనని ప్రకటించింది.
గోలక్‌నాథ్ V/s పంజాబ్ ప్రభుత్వం (1967): పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణల చట్టాన్ని ఈ కేసులో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని కోర్టు తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కులను సవరించాలంటే ‘ప్రత్యేక రాజ్యాంగ పరిషత్’ ఏర్పాటు చేయాలని ప్రకటించింది.
కేశవానంద భారతి V/s కేరళ ప్రభుత్వం (1973): ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించిన 24, 25వ రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే మౌలిక స్వరూపం మార్చకూడదని గోలక్‌నాథ్ కేసులో చెప్పిన తీర్పుకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మౌలిక స్వరూపం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఈ సందర్భంలోనే ప్రయోగించింది.
మినర్వా మిల్స్ V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1980): 42వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ స్వరూపంలో భాగమని, వాటిని తగ్గించడం లేదా రద్దుచేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది.
ఇందిరా సాహ్ని V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1992): వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించారు.
ఉన్నికృష్ణన్ V/s ఆంధ్రప్రదేశ్ (1993), మోహిని జైన్ V/s కర్ణాటక: ప్రాథమిక హక్కుల్లో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
మాదిరి ప్రశ్నలు
1. ప్రాథమిక హక్కులు అనేవి?
1) నిరపేక్షమైనవి
2) ప్రభుత్వ అధికారాలపై పరిమితులు
3) సవరణకు అతీతం
4) న్యాయ సమీక్షకు గురికావు
- View Answer
- సమాధానం: 2
2. ప్రాథమిక హక్కులు?
1) న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు
2) న్యాయ సంరక్షణ లేని హక్కులు
3) నైతిక హక్కులు
4) పౌర హక్కులు
- View Answer
- సమాధానం: 1
3. కిందివాటిలో ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణించేది?
1) గోలక్‌నాథ్
2) కేశవానంద భారతి
3) మేనకా గాంధీ
4) మినర్వా మిల్స్
- View Answer
- సమాధానం: 2
4. సహజీవన హక్కును సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
1) ఖుష్బూ
2) అరుణారాయ్
3) అరుంధతి రాయ్
4) విశాఖ
- View Answer
- సమాధానం: 1
5. కింది ఏ రకమైన అత్యవసర పరిస్థితి ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు?
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) రాజ్యాంగ అత్యవసర పరిస్థితి
3) పై రెండూ
4) పై రెండూ కాదు
- View Answer
- సమాధానం: 2
6. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
1) సుప్రీంకోర్టు
2) రాష్ర్టపతి
3) ప్రధానమంత్రి
4) పార్లమెంటు
- View Answer
- సమాధానం: 2
7. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం ఒక వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చు?
1) ఆర్టికల్ -13
2) ఆర్టికల్ -32
3) ఆర్టికల్ -14
4) ఆర్టికల్ -34
- View Answer
- సమాధానం: 2
8. ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ణించారు?
1) సమానత్వ హక్కు
2) స్వాతంత్య్ర హక్కు
3) పీడనాన్ని నిరోధించే హక్కు
4) రాజ్యాంగ పరిహార హక్కు
- View Answer
- సమాధానం: 4
9. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించే రిట్?
1) హెబియస్ కార్పస్
2) మాండమస్
3) సెర్షియోరరి
4) కోవారెంటో
- View Answer
- సమాధానం: 2
10. ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక, విద్యా హక్కుల ఉద్దేశం?
1) నిరక్షరాస్యతను రూపుమాపడం
2) ఒకే ఒక సంస్కృతిని రూపొందించడం
3) అల్ప సంఖ్యాక వర్గాల సంస్కృతిని సంరక్షించడానికి సాయపడటం
4) భారతదేశ సంస్కృతిని సంరక్షించడానికి సాయపడదు
- View Answer
- సమాధానం: 3
11. ఆర్థిక సమానత్వాన్ని కలిగించేవి?
1) ప్రాథమిక హక్కులు
2) అవతారిక
3) ఆదేశిక సూత్రాలు
4) ప్రాథమిక విధులు
- View Answer
- సమాధానం: 3
12. రాజ్యాంగంలోని ఏ అధికరణం వార్తా ప్రచురణ హక్కును కల్పిస్తుంది?
1) 14
2) 21
3) 32
4) 19
- View Answer
- సమాధానం: 4
13. ఏ రాజ్యాంగం నుంచి చట్టాల సమాన రక్షణను గ్రహించారు?
1) బ్రిటన్
2) అమెరికా
3) ఐర్లాండ్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
14. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేశారు?
1) ప్రకరణ 21 జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకర పర్యావరణ హక్కు
2) ప్రకరణ 48 ఆదేశిక నియమం
3) ప్రకరణ 275 షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
15. విద్యా హక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది?
1) అన్నిస్థాయిల విద్యార్థులకు
2) కళాశాల విద్యార్థులకు
3) సీనియర్ సెకండరీ స్థాయి విద్యార్థులకు
4) 14 ఏళ్ల లోపు విద్యార్థులకు
- View Answer
- సమాధానం: 4
16. చట్టం మూలంగా సమాన రక్షణ అంటే?
1) ప్రత్యేక రక్షణ
2) సమాన అవకాశాలు
3) అసమానతలను తగ్గించడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
17. ప్రాథమిక హ క్కులకు విఘాతం కలిగించేలా రాజ్యం చట్టాలు చేస్తే అవి చెల్లుబాటు కాకుంటే న్యాయస్థానాలు కొట్టేస్తాయి. అయితే చట్టం అనే పదంలోనికి రాని అంశం?
1) ఆర్డినెన్సులు
2) ఉప చట్టాలు
3) నోటిఫికేషన్లు
4) రాజ్యాంగ సవరణ
- View Answer
- సమాధానం: 4
18. నేరారోపణ జరిగిన వ్యక్తితో బలవంతంగా నేరాన్ని ఒప్పించడాన్ని ఏమంటారు?
1) సెల్ఫ్ ఇన్క్రిమినేషన్
2) డబుల్ జపార్డీ
3) ఎక్స్‌పోస్ట్ లా
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
19. ప్రాథమిక హక్కులను అమలుపర్చడంలో పార్లమెంటు కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించొచ్చు. ఆ వర్గాలు?
1) రక్షణ దళాలు
2) నేరస్తులు
3) విదేశీయులు
4) నిందితులు
- View Answer
- సమాధానం: 1
20. కిందివాటిలో వ్యక్తిగత స్వేచ్ఛలపైపరిమితులు?
1) శాంతి భద్రతలు
2) దేశ రక్షణ
3) నైతిక ప్రవర్తన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో సరైంది?
1) హక్కులను డిమాండ్ చేసే వ్యక్తులు కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది.
2) ప్రాథమిక విధులు.. ప్రాథమిక హక్కులపై పరోక్ష పరిమితులుగా పని చేస్తాయి.
3) 1, 2 స్టేట్మెంట్లు సరైనవే
4) 1, 2 రెండూ సరికావు
- View Answer
- సమాధానం: 4
22. సాధారణంగా ప్రాథమిక హక్కులు ప్రభుత్వాల నిరపేక్ష అధికారాలపై పరిమితులు. వాటికి వ్యతిరే కంగా పౌరులకు కల్పిస్తారు. అయితే కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా గుర్తించారు. అవి?
1) పీడన నిరోధ హక్కు
2) అంటరానితనం నిషేధం
3) బాలకార్మిక వ్యవస్థ నిషేధం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
23. కిందివాటిలో ఏ ప్రాతిపదికపై సకారాత్మక వివక్షతను రాజ్యాంగం అనుమతించలేదు?
1) విద్యాపర వెనుకబాటుతనం
2) ఆర్థిక వెనుకబాటుతనం
3) సామాజిక వెనుకబాటుతనం
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
24. న్యాయ సమీక్ష అనేది ఏ ప్రభుత్వ లక్షణం?
1) ఏకకేంద్ర
2) సమాఖ్య
3) పార్లమెంటరీ
4) అన్నీ
- View Answer
- సమాధానం: 2
25. కింది ఏ ప్రకరణను సుప్రీంకోర్టు ఉదారంగా వ్యాఖ్యానించి, పరిధిని బాగా విస్తరించింది?
1) ప్రకరణ-32
2) ప్రకరణ-3
3) ప్రకరణ-20
4) ప్రకరణ-21
- View Answer
- సమాధానం: 4
26. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య వివాదం ఏర్పడటానికి కారణం?
1) ప్రభుత్వ క్రియాశీల సంక్షేమ చర్యలు
2) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు
3) రెండింటి మధ్య మౌలిక రాజ్యాంగంలో ఉన్న సమతా స్థితిని సవరణ ద్వారా ప్రభావితం చేయడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4