Skip to main content

VRO: వీఆర్వోలకు ‘ఆప్షన్’!

గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
VRO
వీఆర్వోలకు ‘ఆప్షన్’!

వీఆర్వో వ్యవస్థ రద్దయినందున ప్రస్తుతం పని చేస్తున్న 5,500 మందికి ఆప్షన్లు ఇచ్చి వారి సానుకూలత మేరకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ మున్సిపాలిటీలు, పం చాయతీరాజ్, వ్యవసాయ శాఖల్లో వీళ్లను సర్దు బాటు చేసే అవకాశముంది. ఈ ఆప్షన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపాలిటీల్లో కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న వార్డు ఆఫీసర్ల బాధ్యతలను వీరికి అప్పగించాలనే ప్రతిపాదన ప్రభుత్వ అంగీకారం పొందిందని తెలుస్తోంది. దీంతో పాటు పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీగా ఉన్న చోట్ల పంచాయతీ సెక్రటరీలుగా, బిల్‌ కలెక్టర్లుగా, వ్యవసాయ శాఖలో వ్యవసాయ సహాయ విస్తరణ అధికారులకు (ఏఈవో) చేదోడు వాదోడుగా పంటల సాగు వివరాలు రికార్డు, పంట నష్టం వివరాలు నమోదు చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆలోచిస్తోంది. 

‘రెవెన్యూలోనే కొనసాగించాలి’

తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని వీఆర్వోల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో తమ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాయి. ఇది సాధ్యం కాదంటున్న ప్రభుత్వ వర్గాలు తొలుత వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న చోట్ల వీరిని అలాట్‌ చేయాలని నిర్ణయించింది. వీఆర్వోలకు ఆప్షన్ ఇచ్చి ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించాలన్న ట్రెసా విజ్ఞప్తి మేరకు ఈ ఆప్షన్ ప్రక్రియకు అంగీకరించినట్టు సమాచారం.

చదవండి: 

JEE Main: జేఈఈ మెయిన్ లో మార్పులు

ఇక వీఆర్‌వోలు నేరుగా సీనియర్‌ అసిస్టెంట్లు.. డిగ్రీతోపాటు ఐదేళ్ల సర్వీసు..

కారుణ్య నియామక సిబ్బందికి కంప్యూటర్‌ ప్రావీణ్య పరీక్షలు

Published date : 19 Feb 2022 03:10PM

Photo Stories