Skip to main content

APPSC : జేఏ పోస్టుల అర్హుల జాబితా విడుదల.. సర్టిఫికెట్ల పరిశీలన తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలకు 63 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిసెంట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు అనంతపురం కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు.
ap government jobs 2023 telugu news
ap government jobs 2023

ఇందుకు సంబంధించి వివరాలను జూలై 15వ తేదీన (శనివారం) ఆమె వెల్లడించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గతంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారి జాబితాను అనుసరించి మెరిట్‌ మేరకు 1ః2 నిష్పత్తితో 126 మందితో తుది జాబితా విడుదల చేసినట్లు వివరించారు. ఈ జాబితాను రెండు జిల్లాల పరిధిలోని ఆర్‌డీఓ, తహసీల్దారు కార్యాలయాలతో పాటు https://ananthapuramu.ap.gov.in/ వైబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. 

సర్టిఫికెట్ల పరిశీలనకు..
జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు జూలై 26న అనంతపురం కలెక్టర్‌ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు అన్ని సంబంఽధిత ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలను వెంట తీసుకురావాలన్నారు. జాబితాలోని అర్హులకు కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (సీపీటీ) ఉంటుందన్నారు. ఈ పరీక్ష నిర్వహించే తేదీని తదుపరి తెలియజేస్తామన్నారు.

Published date : 17 Jul 2023 06:10PM

Photo Stories