ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 177 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సాధించిన 135 మందికి ప్రొవిజినల్ నియామక పత్రాలు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా ఎన్‌ఓసీ వస్తే పత్రాలు జారీ చేస్తామని చెప్పారు. సింగరేణి ఆస్పత్రిలో పరీక్షల అనంతరం ఖాళీల ఆధారంగా పోస్టింగ్ ఇస్తామని తెలిపారు.
కార్యక్రమంలో అధికారులు కోడూరి శ్రీనివాసరావు, వేణుగోపాల్‌రావు, ముకుంద సత్యనారాయణ, నాగేశ్వరరావు, కె.సంతోష్‌కుమార్, బి.సుశీల్‌కుమార్, కె.శివకుమార్, వరప్రసాద్, వెంకటరమణ, ప్రభాకర్ పాల్గొన్నారు.