తెలంగాణ సాయుధ పోరాటం
1. ‘తెలంగాణ రైతాంగ పోరాట భూమిక’ గ్రంథ రచయిత ఎవరు?
1) ఎలిశెట్టి శంకర్రావు
2) భూపాల్‌రెడ్డి
3) ఆదిరాజు వీరభద్రరావు
4) బోయ జంగయ్య
- View Answer
- సమాధానం: 1
2. ‘మా భూమి’ గ్రంథ రచయిత ఎవరు?
1) సుంకర సత్యనారాయణ
2) కృష్ణప్రసాద్
3) సోమసుందర్
4) రేపాల నరసింహుడు
- View Answer
- సమాధానం: 1
3. ‘ఓనమాలు’, ‘రథ చక్రాలు’, ‘మృత్యువు నీడలు’ గ్రంథాల రచయిత ఎవరు?
1) కుందుర్తి ఆంజనేయులు
2) అయ్యప్ప వెంకటరమణ
3) మహీధర్ రామ్మోహన్రావు
4) రేపాల నరసింహుడు
- View Answer
- సమాధానం: 3
4. ‘నాజీ నైజాం’ గ్రంథ రచయిత?
1) అయ్యప్ప వెంకటరమణ
2) చండ్ర రాజేశ్వరరావు
3) ఆరుట్ల రామచంద్రారెడ్డి
4) కృష్ణప్రసాద్
- View Answer
- సమాధానం:1
5. ‘ప్రజల మనిషి’ గ్రంథ రచయిత?
1) వట్టికోట ఆళ్వారుస్వామి
2) బండి యాదగిరి
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) పుచ్చలపల్లి సుందరయ్య
- View Answer
- సమాధానం: 1
6. ‘తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర’ గ్రంథ రచయిత ఎవరు?
1) నల్లా నరసింహులు
2) దేవులపల్లి రామానుజరావు
3) దేవులపల్లి వెంకటేశ్వరరావు
4) ఆరుట్ల రామచంద్రారెడ్డి
- View Answer
- సమాధానం: 2
7. కింది వాటిలో ఆరుట్ల రామ చంద్రారెడ్డి రచించిన గ్రంథం ఏది?
1) నగరంలో వాన
2) వీర తెలంగాణ - విప్లవ పోరాటం
3) తెలంగాణ పోరాట స్మృతులు
4) వీర తెలంగాణ - విప్లవ పోరాటం, గుణపాఠాలు
- View Answer
- సమాధానం: 3
8. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని పేర్కొన్న వారెవరు?
1) దేవులపల్లి రామానుజరావు
2) దాశరథి రంగాచార్యులు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) రావి నారాయణరెడ్డి
- View Answer
- సమాధానం: 2
9. ‘వీర తెలంగాణ - విప్లవ పోరాటం, గుణపాఠాలు’ గ్రంథ రచయిత ఎవరు?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) రావి నారాయణరెడ్డి
3) చండ్ర రాజేశ్వరరావు
4) దేవులపల్లి రామానుజరావు
- View Answer
- సమాధానం: 1
10. ‘పగలెయ్ ఈ నిజాం కోట.. ఎగరెయ్ ఎర్రబావుటా’ గ్రంథ రచయిత?
1) బండి యాదగిరి
2) రెంటాల గోపాలకృష్ణ
3) రేపాల నరసింహుడు
4) నల్లా నరసింహులు
- View Answer
- సమాధానం: 2
11. ‘మా నిజాం రాజు జన్మజన్మల బూజు’ అని పేర్కొన్నది ఎవరు?
1) దాశరథి కృష్ణమాచార్యులు
2) దాశరథి రంగాచార్యులు
3) దేవులపల్లి రామానుజరావు
4) రెంటాల గోపాలకృష్ణ
- View Answer
- సమాధానం: 2
12. ‘హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్’ గ్రంథ రచయిత ఎవరు?
1) స్వామీ రామానంద తీర్థ
2) హయగ్రీవచారి
3) రావి నారాయణరెడ్డి
4) కాశీనాథరావు వైద్య
- View Answer
- సమాధానం: 4
13.ఉస్మానియా యూనివర్సిటీలో ‘వందేమాతర ఉద్యమం’ నాయకుడు ఎవరు?
1) పి.వి. నరసింహారావు
2) హయగ్రీవచారి
3) అచ్యుత రెడ్డి
4) మర్రి చెన్నారెడ్డి
- View Answer
- సమాధానం:3
14. ఉస్మానియా యూనివర్సిటీలో ‘వందేమాతరం’ పాడకుండా ఫర్మానా ఎప్పుడు జారీ చేశారు?
1) 1938 డిసెంబర్ 29
2) 1935 నవంబర్ 29
3) 1938 సెప్టెంబర్ 9
4) 1938 అక్టోబర్ 29
- View Answer
- సమాధానం: 2
15. కోఠిలోని హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ జెండా ఎగరవేసిందెవరు?
1) అరుణా అసఫ్ అలీ
2) సరోజినీ నాయుడు
3) పద్మజా నాయుడు
4) ఆరుట్ల కమలాదేవి
- View Answer
- సమాధానం: 3
16. ‘జాయిన్ ఇండియా’ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
1) 1947 ఆగస్టు 7
2) 1947 ఆగస్టు 5
3) 1947 ఆగస్టు 9
4) 1947 ఆగస్టు 11
- View Answer
- సమాధానం: 1
17. హైదరాబాద్ రాష్ట్రంలో ఏ తేదీన ‘పతాక దినోత్సవం’ నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌పై జాతీయ జెండా ఎగురవేశారు?
1) 1947 అక్టోబర్ 2
2) 1947 నవంబర్ 2
3) 1947 డిసెంబర్ 2
4) 1947 సెప్టెంబర్ 2
- View Answer
- సమాధానం: 4
18. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1) కోటి
2) సుల్తాన్‌బజార్
3) చాదర్‌ఘాట్
4) దారుస్సలాం
- View Answer
- సమాధానం: 4
19. నిజాం రాజు 1947 నవంబర్ 29న మౌంట్ బాటన్‌తో ‘యథాతథ ఒడంబడిక’ కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించింది ఎవరు?
1) లాయక్ అలీ
2) నవాబ్ బహదూర్ యార్ జంగ్
3) కాశీం రజ్వీ
4) చత్తారి నవాబు
- View Answer
- సమాధానం: 4
20. ‘రయ్యత్’ పత్రిక సంపాదకుడు ఎవరు?
1) షోయబుల్లాఖాన్
2) రాజ్ బహదూర్ వెంకట్రామారెడ్డి
3) బూర్గుల రామకృష్ణారావు
4) మందముల నర్సింగరావు
- View Answer
- సమాధానం: 4
21. పోర్చుగీస్వారి నుంచి గోవాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది ఎవరు?
1) కాశీం రజ్వీ
2) నవాబ్యార్ జంగ్
3) చిత్తర నవాబు
4) లాయక్ అలీ
- View Answer
- సమాధానం: 4
22. భారతీయ సైన్యాలు ఎవరి సారథ్యంలో బీరార్ నుంచి నిజాం రాజ్యంలోకి ప్రవేశించాయి?
1) మేజర్ శివదత్
2) మేజర్ రుద్ర
3) జె.ఎన్. చౌదరి
4) ఎవరూకాదు
- View Answer
- సమాధానం: 1
23. ఆపరేషన్ పోలోకు ‘పోలీస్ యాక్షన్’ అనే పేరు సూచించింది ఎవరు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) సర్దార్ వల్లభాయ్ పటేల్
3) జె.ఎన్. చౌదరి
4) సి. రాజగోపాలాచారి
- View Answer
- సమాధానం: 4
24. ‘ది కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హెచ్.ఇ.హెచ్. నిజాం ఆఫ్ హైదరాబాద్’ గ్రంథ రచయిత?
1) త్రిపురనేని రంగయ్య
2) గోగినేని రంగనాయకులు
3) గోగినేని రంగనాథ రావు
4) సూర్యప్రకాశ్ రావు
- View Answer
- సమాధానం: 2
25. హైదరాబాద్‌పై సైనికదాడి చేయడానికి ఒక వ్యూహాన్ని రచించమని వల్లభాయ్ పటేల్ ఎవరిని ఆదేశించారు?
1) జనరల్ రాజేంద్రసింగ్ జడేజా
2) లెఫ్టినెంట్ జనరల్ ఇ.ఎన్. గోదార్డ్
3) జె.ఎన్. చౌదరి
4) ఎ.ఎ. రుద్ర
- View Answer
- సమాధానం: 2
26. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యం భారత యూనియన్ సైన్యాన్ని ఎదిరించిన ప్రదేశం ఏది?
1) విజయవాడ
2) భువనగిరి
3) సూర్యాపేట
4) ఔరంగాబాద్
- View Answer
- సమాధానం: 3
27. కింది వాటిలో జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి రచన ఏది?
1) ది జుడీషియరీ ఐ సర్వడ్
2) ది జుడీషియరీ
3) ది జుడీషియరీ ప్రాబ్లమ్స్
4) ది జుడీషియరీ ఆఫ్ హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
28.బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు?
1) 1951 మార్చి 6
2) 1950 మార్చి 6
3) 1952 మార్చి 6
4) 1949 మార్చి 6
- View Answer
- సమాధానం: 3
29. హైదరాబాద్‌లో ముల్కీ ఉద్యమం సందర్భంగా పి.డి. యాక్ట్ కింద అరెస్టైన శాసన సభ్యుడు ఎవరు?
1) నవాబ్‌జంగ్ బహదూర్
2) పూల్ చంద్ గాంధీ
3) జి.ఎస్. మెల్కోటె
4) సయ్యద్ అక్తర్ హుస్సేన్
- View Answer
- సమాధానం: 4
30. ‘వెట్టిచాకిరి’ గ్రంథకర్త ఎవరు?
1) ఎలిశెట్టి శంకర్రావు
2) కాళోజీ నారాయణరావు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) ఆవులు పెచ్చయ్య
- View Answer
- సమాధానం: 4
31. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
1) పంపన్నగౌడ్
2) వి.డి. దేశ్‌పాండే
3) దిగంబర రావు బిందు
4) భగవంతరావు గాదె
- View Answer
- సమాధానం: 2
32. 1952లో ‘నాన్‌ముల్కీ గో బ్యాక్’ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
1) హైదరాబాద్
2) వరంగల్
3) కరీంనగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
33. సిటీ కాలేజ్ కాల్పుల సంఘటనపై ఎవరి అధ్యక్షతన న్యాయ విచారణ సంఘం నియమించారు?
1) పూల్‌చంద్ గాంధీ
2) కొండా వెంకట రంగారెడ్డి
3) డాక్టర్ మెల్కోటె
4) పింగళి జగన్మోహన్రెడ్డి
- View Answer
- సమాధానం: 4
34. కింద పేర్కొన్నవారిలో మొదటి ఎస్.ఆర్.సి.కి సంబంధించని వారెవరు?
1) కె.ఎం. ఫణీక్కర్
2) హెచ్.ఎన్. కుంజ్రూ
3) సయ్యద్ ఫజల్ అలీ
4) బి.ఎన్. శ్రీకృష్ణ
- View Answer
- సమాధానం: 4
35. కింది వాటిలో ఎక్కడ నిర్వహించిన సమావేశంలో ఆంధ్ర మహాసభ నాయకుల్లో చీలిక ఏర్పడింది?
1) హుజూర్ నగర్
2) మల్కాపురం
3) ధర్మవరం
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 2
36. ‘జెంటిల్మెన్ ఒప్పందం’లో మొత్తం ఎన్ని అంశాలపై, ఏ రోజున సంతకం చేశారు?
1) 14 అంశాలు, 1956 ఆగస్టు 14
2) 14 అంశాలు, 1956 ఫిబ్రవరి 20
3) 13 అంశాలు, 1956 ఆగస్టు 14
4) 13 అంశాలు, 1956 ఫిబ్రవరి 20
- View Answer
- సమాధానం: 1
37. వరంగల్‌లో నిర్వహించిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి?
1) దాశరథి కృష్ణామాచార్యులు
2) దాశరథి రంగాచార్యులు
3) వట్టికోట ఆళ్వారుస్వామి
4) కాళోజీ నారాయణరావు
- View Answer
- సమాధానం: 4
38. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో ఏ భాగంలో ఉంది?
1) పార్ట్-ఎ
2) పార్ట్-సి
3) పార్ట్-బి
4) పార్ట్-డి
- View Answer
- సమాధానం: 3
39. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ (హెచ్.ఎస్.సి.) తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని ఎప్పుడు చేసింది?
1) 1954 జూన్ 7
2) 1953 జూన్ 7
3) 1955 జూన్ 7
4) 1956 జూన్ 7
- View Answer
- సమాధానం: 1
40. హెచ్.ఎస్.సి. సమావేశంలో విశాలాంధ్రను సమర్థించిన నాయకుడు ఎవరు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) జె.వి. నర్సింగరావు
3) స్వామీ రామానంద తీర్థ
4) మాడపాటి హన్మంతరావు
- View Answer
- సమాధానం: 3
41.భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన యు.ఎన్. దేబర్‌కు తెలంగాణపై లేఖ రాసిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడు?
1) స్వామీ రామానంద తీర్థ
2) జె.వి.నర్సింగరావు
3) బూర్గుల రామకృష్ణారావు
4) మర్రి చెన్నారెడ్డి
- View Answer
- సమాధానం: 3
42. ముల్కీ ఉద్యమం సందర్భంగా సిటీ కాలేజ్ సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1952 సెప్టెంబర్ 2
2) 1952 సెప్టెంబర్ 3
3) 1952 సెప్టెంబర్ 4
4) 1952 సెప్టెంబర్ 7
- View Answer
- సమాధానం: 2
43.సురవరం ప్రతాపరెడ్డి 1951 ఆగస్టులో ఏ పత్రికకు ‘తెలంగాణ - తెలుగు పత్రికలు’ అనే వ్యాసాన్ని రాశారు?
1) గోలకొండ
2) కాకతీయ
3) సుజాత
4) కృష్ణా పత్రిక
- View Answer
- సమాధానం: 3
44. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వి.బి. రాజు ఏ శాఖకు మంత్రిగా పని చేశాడు?
1) విద్య - ఆరోగ్యశాఖ
2) సాంఘిక సంక్షేమ శాఖ
3) పరిశ్రమలు - వాణిజ్యం
4) కార్మిక - ప్రణాళిక శాఖ
- View Answer
- సమాధానం: 4
45. హైదరాబాద్ రాష్ట్రంలోని మొత్తం నియోజక వర్గాల సంఖ్య?
1) 142
2) 33
3) 175
4) 101
- View Answer
- సమాధానం:3
46. హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 1951
2) 1952
3) 1953
4) 1954
- View Answer
- సమాధానం: 2
47. ఎక్కడ జరిగిన నిజామాంధ్ర మహాసభలో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు?
1) హైదరాబాద్
2) భువనగిరి
3) దేవరకొండ
4) జోగిపేట
- View Answer
- సమాధానం: 1
48.‘నాన్ ముల్కీ గోబ్యాక్’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రామాచారి ఏ ప్రాంతానికి చెందినవారు?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) తెలంగాణ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
49. ‘హైదరాబాద్ హిత రక్షణ సమితి’ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1951
2) 1954
3) 1953
4) 1952
- View Answer
- సమాధానం: 4
50. కింది వారిలో బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సభ్యుడు కానివారు?
1) దిగంబరరావు బిందు
2) శంకర్ దేవ్
3) రామాచారి
4) మర్రి చెన్నారెడ్డి
- View Answer
- సమాధానం: 3
51. యథాతథ ఒప్పందం ప్రకారం నిజాం రాజ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?
1) కె.ఎం.మున్షీ
2) సయ్యద్ అహ్మద్
3) రాజ్ బహదూర్ వెంకట్రామారెడ్డి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
52.నిజాం చిట్టచివరి ప్రధాని ఎవరు?
1) జైన్‌యార్ జంగ్
2) చిత్తర నవాబు
3) మెయిన్ నవాబ్ జంగ్
4) లాయక్ అలీ
- View Answer
- సమాధానం: 4