మాదిరి ప్రశ్నలు-2
1. వరంగల్లు నగర వర్ణన, నాటి సామాజిక పరిస్థితులను చక్కగా వర్ణించిన కావ్యం?
1) క్రీడాభిరామం
2) కళాపూర్ణోదయం
3) కుమార సంభవం
4) పండితారాధ్య చరిత్ర
- View Answer
- సమాధానం: 1
2. సాంఘిక దురాచారమైన జోగినీ వ్యవస్థను రూపుమాపడానికి సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించిందెవరు?
1) అరిగె రామస్వామి
2) భాగ్యరెడ్డి వర్మ
3) త్రిపురనేని రామస్వామి చౌదరి
4) కందుకూరి వీరేశలింగం
- View Answer
- సమాధానం: 1
3. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించే దాశరిథి కృష్ణమాచార్య అవార్డుకు తొలిసారి ఎంపికైనవారు?
1) సి. నారాయణ రెడ్డి
2) తిరుమల శ్రీనివాసాచార్య
3) దాశరథి రంగాచార్య
4) కాళోజీ నారాయణరావు
- View Answer
- సమాధానం: 2
4. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ఐదో రోజును ఏమంటారు?
1) అటుకుల బతుకమ్మ
2) వెన్నముద్దల బతుకమ్మ
3) అట్ల బతుకమ్మ
4) నానబియ్యం బతుకమ్మ
- View Answer
- సమాధానం: 3
5. తెలంగాణలో ఎంతో ప్రసిద్ధమైన బాసర సరస్వతి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
1) కృష్ణా
2) గోదావరి
3) మంజీర
4) భీమ
- View Answer
- సమాధానం: 2
6. నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన తెలంగాణ కళారూపం ఏది?
1) బుర్ర కథలు
2) శారదా కథలు
3) వేదాంత భేరి
4) గొల్ల సుద్దులు
- View Answer
- సమాధానం: 1
7. హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎవరి నివాసంలో ఏర్పాటు చేశారు?
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) ఉన్నవ లక్ష్మీనారాయణ
3) ఆదిపూడి సోమనాథరావు
4) రావిచెట్టు రంగారావు
- View Answer
- సమాధానం: 4
8. తెలంగాణలో రెండో అతి పెద్దదైన గొల్లగట్టు జాతరకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఇక్కడి దైవం లింగమంతుల స్వామి
2) దీనినే పెద్దగట్టు జాతర అని కూడా అంటారు
3) ఇది సూర్యాపేట జిల్లాలో ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
9. పూర్వ కాలంలో రంజు కళాకారులు ఎవరిని యాచించి జీవనం గడిపేవారు?
1) రెడ్లు
2) వెలమలు
3) విశ్వబ్రాహ్మణులు
4) వైశ్యులు
- View Answer
- సమాధానం: 3
10. ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ అనే రచన ద్వారా జాతీయ పురస్కారం పొందిన తెలంగాణ కవి?
1) సి. నారాయణ రెడ్డి
2) బోయి భీమన్న
3) కోదాటి నారాయణరావు
4) ఉన్నవ లక్ష్మీనారాయణ
- View Answer
- సమాధానం: 2
11.2008లో ఏర్పాటైన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన పండుగ?
1) బతుకమ్మ
2) బోనాలు
3) సమ్మక్క-సారక్క
4) మొహర్రం
- View Answer
- సమాధానం: 1
12. తెలంగాణలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం?
1) భ్రమరాంబ
2) జోగులాంబ
3) మహంకాళి
4) పరమేశ్వరి
- View Answer
- సమాధానం: 2
13. వాత్సాయన కామ సూత్రాల్లో ఏ శాతవాహన చక్రవర్తి ప్రస్తావన ఉంది?
1) శ్రీముఖుడు
2) పులోమావి
3) కుంతల శాతక ర్ణి
4) ఖారవేలుడు
- View Answer
- సమాధానం: 3
14. తెలుగులో తొలి యక్షగానమైన సుగ్రీవ విజయం రాసింది?
1) అద్దంకి గంగాధరుడు
2) పొన్నగంటి తెలగన్న
3) కందుకూరి రుద్రకవి
4) సారంగు తమ్మయ్య
- View Answer
- సమాధానం: 3
15.శతపత్రం అనేది ఏ తెలంగాణ కవి ఆత్మకథ?
1) గడియారం రామకృష్ణశర్మ
2) కాళోజీ నారాయణరావు
3) సామల సదాశివ
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 1
16. తెలంగాణలో ప్రసిద్ధి జానపద కళ ఒగ్గు కథకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఇది కర్మకులం వారు ప్రదర్మించే కళారూపం
2) ఈ ప్రదర్మనలో ఒగ్గుతో పాటు డోలు, తాళాలు ఉపయోగిస్తారు
3) ఈ ప్రదర్మనలో ఐదారుగురు పాల్గొంటారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
17. హైదరాబాద్ సంస్థానం రద్దు అవుతున్న నాటి రోజుల్లోని హిందూ-ముస్లింల అనుబంధాలను వివరిస్తూ చార్మినార్ కథలు రాసినవారు?
1) వట్టికోట ఆళ్వారు స్వామి
2) నెల్లూరి కేశవ స్వామి
3) పొట్లపల్లి రామారావు
4) బొల్లిముంత శివరామకృష్ణ
- View Answer
- సమాధానం: 2
18. మొహర్రం పండుగలో భాగంగా ఎన్ని రోజులు సంతాప దినాలుగా పాటిస్తారు?
1) 9
2) 10
3) 8
4) 3
- View Answer
- సమాధానం: 2
19. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ద్వారా ప్రచురితమైన తొలి పుస్తకం అబ్రహం లింకన్ను రాసింది ఎవరు?
1) గాడిచర్ల హరి సర్వోత్తమరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) దేవులపల్లి రామానుజరావు
4) బూర్గుల రామకృష్ణారావు
- View Answer
- సమాధానం: 1
20. దాశరథి కృష్ణమాచార్యులు ఏ ప్రాంతంలో జైలు జీవితం గడుపుతున్నప్పుడు జైలు గోడల మీద విప్లవ గీతాలు రాశారు?
1) వరంగల్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 4
21. సమ్మక్క-సారక్క జాతరకు సంబంధించి సరైన అంశం ఏది?
1) ఇది భూపాలపల్లి జిల్లా మేడారం గ్రామంలో జరుగుతుంది
2) ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర
3) రెండేళ్ళకోసారి మాఘశుద్ది పౌర్ణమి రోజున నిర్వహిస్తారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
22. దళిత కవి బోయ జంగయ్య రాసిన ఏ కావ్యానికి శ్రీశ్రీ స్మారక పురస్కారం లభించింది?
1) జాతర
2) జగడం
3) హెచ్చరిక
4) గొర్రెలు
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిలో తెలంగాణలో భౌగోళిక సూచిక గుర్తింపు మొదట పొందింది ఏది?
1) పెంబర్తి ఇత్తడి కళ
2) హైదరాబాద్ బిర్యానీ
3) హలీం
4) పోచంపల్లి వస్త్రాల డిజైన్
- View Answer
- సమాధానం: 4
24. జాయపసేనాని రాసిన నృత్య రత్నావళిలోని భంగిమల శిల్పాలు ఏ దేవాలయంలో కనిపిస్తాయి?
1) రామప్ప దేవాలయం
2) వేయి స్తంభాల గుడి
3) వేములవాడ దే వాలయం
4) బాసర సరస్వతీ ఆలయం
- View Answer
- సమాధానం: 1
25. తెలంగాణలో అత్యధికంగా ఉన్న గిరిజన తెగ?
1) కోయలు
2) లంబాడీలు
3) చెంచులు
4) గోండులు
- View Answer
- సమాధానం: 2
26. గిరిజనుల ప్రముఖ పండుగైన తీజ్ పండుగను ఏ నెలలో జరుపుకుంటారు?
1) శ్రావణం
2) కార్తీకం
3) చైత్రం
4) ఆషాడం
- View Answer
- సమాధానం: 4
27. ‘శోభ’ అనే సాహిత్య పత్రిక వరంగల్ నుంచి ఎవరి సంపాదకత్వంలో వెలువడేది?
1) దేవులపల్లి రామానుజరావు
2) పి.వి. నరసింహారావు
3) విశ్వనాథ సత్యనారాయణ
4) కాళోజీ నారాయణరావు
- View Answer
- సమాధానం: 1
28. గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) వరంగల్
- View Answer
- సమాధానం: 1
29. ఇక్కత్ అనే కళారూపం విశిష్టత?
1) పోచంపల్లి వస్త్రాలపై డిజైన్
2) నిర్మల్ కొయ్యబొమ్మల కర్ర
3) పెంబర్తి ఇత్తడి ముడి వస్తువు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
30. గరగ నృత్యాన్ని ఏ పండుగ సందర్భంగా వీధుల్లో ప్రదర్శిస్తారు?
1) మొహర్రం
2) బతుకమ్మ
3) బోనాలు
4) ఉర్సు
- View Answer
- సమాధానం: 3
31. సమ్మక్క-సారక్క జాతరలో దేవతలకు బంగారం పేరుతో ఏమి సమర్పిస్తారు?
1) బెల్లం
2) పూలు
3) పండ్లు
4) వస్త్రాలు
- View Answer
- సమాధానం: 1
32. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్నవారు?
1) దాశరథి
2) సురవరం
3) కాళోజీ
4) దేవులపల్లి
- View Answer
- సమాధానం: 3
33. బుక్కపట్నం రామానుజాచార్యులు నిర్వహించిన తెలంగాణ తొలి దినపత్రిక ఏది?
1) మషీర్-ఎ-దక్కన్
2) మాతృభూమి
3) ఇమ్రోజ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
34. తన ‘కాశీయాత్ర చరిత్ర’ గ్రంథంలో మొహర్రం పండుగ గూర్చి ప్రస్తావించిన రచయిత?
1) ఏనుగుల వీరస్వామయ్య
2) చందాల కేశవదాసు
3) ధర్మవరపు సీతారాం
4) దాశరథి రంగాచార్య
- View Answer
- సమాధానం: 1
35. బోనాల పండుగనాడు అమ్మవారి విగ్రహం ముందు బియ్యం పిండిలో పసుపు కలిపి సంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేయడాన్ని ఏమంటారు?
1) సాక
2) రంగం
3) పటం
4) ఊరడి
- View Answer
- సమాధానం: 3
36. తెలుగు వారి తొలి విజ్ఞాన సర్వస్వంగా గుర్తించబడిన పాల్కురికి సోమనాథుని రచన?
1) బసవ పురాణం
2) పండితారాధ్య చరిత్ర
3) అనుభవ సారం
4) చతుర్వేద సారం
- View Answer
- సమాధానం: 2
37. కాకతీయ రుద్రదేవుడు నీతిసారం గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు?
1) తెలుగు
2) సంస్కృతం
3) కన్నడం
4) ప్రాకృతం
- View Answer
- సమాధానం: 2
38. తెలంగాణలో తొలి రైతు కావ్యం కాపుబిడ్డను రాసింది ఎవరు?
1) గంగుల శాయిరెడ్డి
2) వట్టికోట ఆళ్వారుస్వామి
3) రుక్నుద్దీన్
4) వేముగంట నరసింహాచార్యులు
- View Answer
- సమాధానం: 1
39. బోనాల పండుగలో భాగమైన ‘రంగమెక్కుడు’ అంటే?
1) బోనం (భోజనం సమర్పించడం)
2) జంతు బలులు
3) శివసత్తుల భవిష్యవాణి
4) ఊరేగింపు
- View Answer
- సమాధానం: 3
40. తెలంగాణ రాష్ర్ట పండుగ అయిన బతుకమ్మ పండుగ ఏ మాసంలో వస్తుంది?
1) శ్రావణం
2) భాద్రపదం
3) ఆశ్వయుజం
4) కార్తీకం
- View Answer
- సమాధానం: 3