Polity Bit Bank For All Competitive Exams: ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
1. భారతదేశంలో మొదటి భాషాప్రయుక్త రాష్ర్టం ఏది?
ఎ) ఆంధ్రరాష్ర్టం
బి) తమిళనాడు
సి) పంజాబ్
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: ఎ
2. శ్రీబాగ్ ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది?
ఎ) ఆంధ్ర-తెలంగాణ నాయకులు
బి) రాయలసీమ-ఆంధ్ర నాయకులు
సి) ఆంధ్ర-మద్రాస్ రాష్ర్ట నాయకులు
డి) పైవారందరి మధ్య
- View Answer
- సమాధానం: బి
3. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ అనేది రాజ్యాంగ పరిషత్ ఉప సంఘం. దీని అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు?
ఎ) ధార్
బి) హెచ్.సి.ముఖర్జీ
సి) నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్
డి) ఫజల్ అలీ
- View Answer
- సమాధానం: ఎ
4. రాష్ట్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారం పార్లమెంట్‌కు ఏ విధంగా ఉంది?
ఎ) రాష్ట్రాల విన్నపం మేరకు
బి) విదేశీ దురాక్రమణ కారణంగా
సి) రాష్ట్రాల సమ్మతి లేకుండానే
డి) రాష్ట్రాల సమ్మతితో
- View Answer
- సమాధానం: సి
5. కింద ఇచ్చిన వారిలో పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొనని తెలంగాణ నాయకుడు?
ఎ) మర్రి చెన్నారెడ్డి
బి) పి.వి.నరసింహారావు
సి) జె.వి.నరసింగరావు
డి) కె. వెంకట రంగారెడ్డి
- View Answer
- సమాధానం: బి
6. ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
ఎ) ఫిబ్రవరి-1955
బి) ఫిబ్రవరి-1956
సి) మార్చి-1955
డి) నవంబర్-1956
- View Answer
- సమాధానం: బి
7. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానిక పాలన (పంచాయతీరాజ్) మంత్రిగా పని చేసి తర్వాత ముఖ్యమంత్రి అయినవారు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) బూర్గుల రామకృష్ణరావు
సి) కాసు బ్రహ్మనందరెడ్డి
డి) జలగం వెంగళరావు
- View Answer
- సమాధానం: సి
8. కింది వాటిలో సరైంది?
ఎ) అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ర్ట్టం ఏర్పడింది
బి) ఆంధ్ర రాష్ర్ట శాసన సభ మొదటి స్పీకర్ - వెంకట్రామయ్య
సి) ఆంధ్ర రాష్ర్ట రాజధాని-కర్నూలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. ఆంధ్ర రాష్ర్ట మొదటి ముఖ్యమంత్రి?
ఎ) బెజవాడ గోపాల్ రెడ్డి
బి) కె.వి.రంగారెడ్డి
సి) నీలం సంజీవరెడ్డి
డి) టంగుటూరి ప్రకాశం పంతులు
- View Answer
- సమాధానం: డి
10. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు?
ఎ) మర్రి చెన్నారెడ్డి
బి) పి.వి.నరసింహారావు
సి) జలగం వెంగళరావు
డి) టంగుటూరి అంజయ్య
- View Answer
- సమాధానం: బి
11. పూర్తికాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) మర్రి చెన్నారెడ్డి
సి) టి.అంజయ్య
డి) జలగం వెంగళరావు
- View Answer
- సమాధానం: డి
12. కింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు?
ఎ) కె.వి.రంగారెడ్డి
బి) జె.వి.నరసింహారావు
సి) కొనేరు రంగారావు
డి) మర్రి చెన్నారెడ్డి
- View Answer
- సమాధానం: బి
13. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి హోంశాఖ మంత్రి ఎవరు?
ఎ) బెజవాడ గోపాల్‌రెడ్డి
బి) కె.వి.రంగారెడ్డి
సి) కళా వెంకట్రావ్
డి) కల్లూరి సుబ్బారావు
- View Answer
- సమాధానం: ఎ
14. హైదరాబాద్ రాష్ర్ట ఏకైక స్పీకర్?
ఎ) కాశీనాథరావు వైద్య
బి) సాలార్ జంగ్
సి) మాడపాటి హనుమంతరావు
డి) పై ఎవరు కాదు
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
15. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) కాసు బ్రహ్మానందరెడ్డి
సి) దామోదరం సంజీవయ్య
డి) పి.వి.నరసింహారావు
- View Answer
- సమాధానం: బి
16. కింది వాటిలో సరికాని జత?
ఎ) ప్రాథమిక హక్కులు - అమెరికా
బి) సమాఖ్య ప్రభుత్వం - బ్రిటన్
సి) కాగ్ వ్యవస్థ - బ్రిటన్
డి) ఆదేశిక సూత్రాలు - ఐర్లాండ్
- View Answer
- సమాధానం: బి
17. తెలంగాణలో నిర్మితమైన మొదటి రైలు మార్గం?
ఎ) సికింద్రాబాద్ - వాడి
బి) సికింద్రాబాద్ - గుల్బర్గా
సి) కాచిగూడ - మహబూబ్‌నగర్
డి) కాచిగూడ - వరంగల్
- View Answer
- సమాధానం: ఎ
18. సింగరేణి కాలరీస్‌ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1921
బి) 1890
సి) 1937
డి) 1943
- View Answer
- సమాధానం: ఎ
19. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథ రచయిత?
ఎ) మాడపాటి హన్మంతరావు
బి) బూర్గుల రామకృష్ణ్ణారావు
సి) సురవరం ప్రతాపరెడ్డి
డి) రావి నారాయణరెడ్డి
- View Answer
- సమాధానం: సి
20. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆంధ్ర సారస్వత పరిషత్‌ను ఎప్పడు స్థాపించారు?
ఎ) 1923
బి) 1943
సి) 1947
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
21. మహ్మదీయులను ఏకం చేసి వారి అభివృద్ధికి కృషి చేసేందుకు ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1927
బి) 1944
సి) 1952
డి) 1957
- View Answer
- సమాధానం: ఎ
22. తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమాలకు ఆద్యుడు?
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) అరిగె రామస్వామి
సి) బి.యస్.వెంకట్రావ్
డి) సంగం లక్ష్మీభాయి
- View Answer
- సమాధానం: ఎ
23. నిజాం ప్రభుత్వంపై సర్దార్ పటేల్ చొరవతో భారత సైన్యం జరిపిన సైనిక చర్య?
ఎ) ఆపరేషన్ పోలో
బి) ఆపరేషన్ బ్లూస్టార్
సి) ఆపరేషన్ పీస్
డి) ఆపరేషన్ డిజాస్టర్
- View Answer
- సమాధానం: ఎ
24. హైదరాబాద్ రాష్ర్ట ఆవిర్భావం?
ఎ) 1-10-1953
బి) 17-9-1948
సి) 17-9-1952
డి) 17-9-1949
- View Answer
- సమాధానం: బి
25. నిజాం ప్రభుత్వంపై జరిపిన ‘ఆపరేషన్ పోలో’కు ఎవరు నాయకత్వం వహించారు?
ఎ) జనరల్ కరియప్ప
బి) జనరల్ మెనేక్ష
సి) మేజర్ జనరల్ జె.యస్.చౌదరి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి