Skip to main content

UPSC Civils 62nd Ranker Sri Pooja : ల‌క్ష‌ల జీతం కాద‌నీ.. ఈ ల‌క్ష్యం కోస‌మే సివిల్స్ రాశా..

62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. శ్రీపూజ ఎన్‌ఐటీ సూరత్‌కల్‌లో బీటెక్‌ చేశారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. తాను తొలిసారి సివిల్స్‌కు సిద్ధమైనప్పుడు ఢిల్లీలో శిక్షణ తీసుకున్నానని, తదనంతరం కరోనా కారణంగా ఇంట్లోనే ఉండి ఇపుడు రెండోసారి మెయిన్స్‌ రాసి విజయం సాధించానన్నారు. ‘చిన్నప్పటి నుంచే సివిల్స్‌ లక్ష్యంగా ముందుకు సాగాను. అందుకే లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. ఐఏఎస్‌ కావాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నా. మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి సివిల్స్‌లో ర్యాంకును సాధించాన‌ని చెప్పుతున్న‌ శ్రీపూజితతో సాక్షి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories