UPSC Exams: యూపీఎస్సీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో నవంబర్ 21 న కంబైన్డ్ మెడికల్ సరీ్వసెస్ (14 ) కేంద్రాల్లో 6 వేల మంది అభ్యర్థులు, ఇంజినీరింగ్ సరీ్వసెస్ మెయిన్ (1 ) కేంద్రాల్లో 110 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, ఇంజినీరింగ్ సరీ్వసెస్ మెయిన్ ఉదయం 9.00 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్న ఈ–అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. అభ్యర్థులు కోవిడ్ నిబంధనల ప్రకారం మాసు్కలు, శానిటైజర్లు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. మాసు్కలు లేని అభ్యర్థులను పరీక్షకు అనుమతించరని స్పష్టం చేశారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వెన్యూ సూపర్‌వైజర్లతో పాటు లోకల్ ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్లు ఉంటారని తెలిపారు.