Skip to main content

UGC NET 2023 Notification: జూన్‌ (యూజీసీ-నెట్‌) పరీక్షకు షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా‌..

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ).. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2023, జూన్‌ (యూజీసీ-నెట్‌) పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్‌లో నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంటారు.
ugc net 2023 exam pattern and syllabus

సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్‌ కల్చర్‌ అండ్‌ ఇస్లామిక్‌ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ క్రి మినాలజీ తదితరాలు.
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు 01.06.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు గరిష్ట వయోపరిమితి లేదు.

చ‌ద‌వండి: CSIR UGC NET Study Material

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్‌ టైప్, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

చ‌ద‌వండి: Model Papers

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.05.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 02, 03.06.2023.
పరీక్ష తేదీలు: 13.06.2023 నుంచి 22.06.2023 వరకు 

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/

చ‌ద‌వండి: CSIR - NET Previous Papers

Published date : 15 May 2023 03:28PM

Photo Stories