Skip to main content

TSPSC Group-2 Jobs List 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పోస్టులు ఇవే.. కేటగిరీ, శాఖల వారీగా ఖాళీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌ను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వ‌హించనున్నారు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా.. వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి.

జనరల్‌ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. రెండు విభాగాల్లోని పోస్టుల్లో చూస్తే ఒక్కటీ కూడా జనరల్‌ కేటగిరీలో లేదు. మొత్తంగా ఈ నోటిఫికేష‌న్‌లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కినట్లు అయింది. ఈ 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు గాను మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో TSPSC గ్రూప్‌–2 కేటగిరీలో శాఖలవారీగా ఉద్యోగ ఖాళీల వివ‌రాలు మీకోసం..

☛ TSPSC Group 2 Exam Dates 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. 350 పోస్టులు మహిళలకే.. కానీ

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 కేటగిరీలో శాఖలవారీగా పోస్టుల వివ‌రాలు ఇవే..

పోస్టు

ఖాళీలు

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3

11

అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌

59

నాయబ్‌ తహసీల్దార్‌

98

సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2

14

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కోఆపరేటివ్‌)

63

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌

09

మండల పంచాయత్‌ ఆఫీసర్‌

126

ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

97

అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (చేనేత)

38

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (జీఏడీ)

165

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (శాసనసభ సచివాలయం)

15

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌)

25

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (లా)

07

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (రాష్ట్ర ఎన్నికల కమిషన్‌)

02

డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2 జువెనైల్‌ సర్వీస్‌

11

అసిస్టెంట్‌ బీసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌

17

అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

09

అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

17

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 05 Jul 2023 03:52PM

Photo Stories