Skip to main content

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వ‌ర‌లోనే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు..!

తెలంగాణ‌లో కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు దాదాపు పూరైంది. ఇక రాష్ట్రంలో భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.
telangana government jobs
Telangana Government Jobs

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌ను త్వ‌ర‌లోనే చెప్ప‌నుంది. ఈ మేర‌కు భారీ ఉద్యోగ ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి నెల చివ‌రి వారంలో ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు విడుద‌ల చేయ‌నున్నట్టు స‌మాచారం. 

ఈ నెలాఖరులోగా తొలి నోటిఫికేషన్‌..
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు, పోస్టింగ్‌లు పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వచ్చే వారంలో ఈ నిర్ణయం తీసుకుని ఈ నెలాఖరులోగా తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫేజ్ 1లో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్యను ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

70 వేల వరకు పోస్టులు భర్తీ చేయాలని..
అయితే ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ప్రణాళిక‌లు కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్.. అన్ని శాఖ‌ల్లో ఉన్న ఖాళీల వివరాలన తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 70 వేల వరకు పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది. 

17 వేలు పోలీసు ఉద్యోగాలు..
పోలీసు ఉద్యోగాలు 17 వేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు టీఎస్‌పీఎస్ నుంచి గ్రూప్-2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయాని అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Published date : 18 Feb 2022 01:09PM

Photo Stories