Skip to main content

TSPSC One Time Registration: ఓటీఆర్ ఆప్షన‌కు దారేది..?

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ మార్చి 28వ తేదీ నుంచి ఓటీఆర్‌ ఫారమ్‌ అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెల్సిందే.
TSPSC OTR
TSPSC One Time Registration Procedure

పాత అభ్యర్థుల వ్యక్తిగల వివరాల సవరణతో పాటు.. కొత్త అభ్యర్థులు కూడా వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్ప‌టికే 25 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు త‌మ పేర్ల‌ను OTRలో రిజిస్టేష‌న్ చేసుకున్నారు. ఒకవేళ OTR రిజిస్టేష‌న్  పొర‌పాట్లు జ‌రిగితే ఉద్యోగ నియామ‌క స‌మ‌యంలో స్థానిక‌త నిర్ధార‌ణ స‌మ‌యంలో అవే త‌ప్పులు దొర్లుతాయి. ఇందుకే ఎడిట్ చేసే స‌మయంలో చాలా క్షుణంగా ప‌రిశీలించి వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని టీఎస్‌పీఎస్సీ వ‌ర్గాలు తెలుపుతున్నాయి. మీ ఎడిట్ ప్ర‌క్రియ పూర్తైయిన త‌ర్వాత అంతా స‌రిగ్గా ఉందో లేదో చెక్ చేసుకున్న త‌ర్వాత‌నే స‌బ్‌మిట్‌ బ‌ట‌న్ నొక్కండి.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి
 
విద్యార్హతలను..
పాత అభ్యర్థులు ఎడిట్‌ ఓటీఆర్‌ ద్వారా.. కొత్త అభ్యర్థులు తాజా రిజిస్ట్రేషన్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెల్సిందే. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ www.tspsc.gov.in ద్వారా ఓటీఆర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను ఎంచుకొని, కొత్త స్థానికత, విద్యార్హతలను మార్చుకోవచ్చు. ఇందుకు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిషన్‌ కసరత్తు పూర్తి చేసింది.

రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం..
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికత అర్హతలను సైతం తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఇది వరకు 4 నుంచి 10 తరగతుల వరకు 4 ఏళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లాలో స్థానికుడిగా పరిగణించేవారు.

Groups Guidance: మొదటిసారిగా గ్రూప్‌ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

1 నుంచి 7 తరగతుల్లో..
ఇప్పుడు 1 నుంచి 7 తరగతుల్లో చివరి 4 ఏళ్లు ఏ జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌లో చదివితే ఆ జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌లలో స్థానికుడిగా పరిగణిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో మార్పులు చేయాల్సి ఉంది. దీంతో కమిషన్‌ వెబ్‌సైట్‌లో మార్పులకు అధికారులు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

ఏ జిల్లాలో చదివారో పొందుపరిస్తే..
అభ్యర్థులు 1 నుంచి 7 తరగతులను ఏ జిల్లాలో చదివారో పొందుపరిస్తే, ఏ జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌కు చెందినవారో ఆటోమెటిక్‌గా వెబ్‌సైట్‌ చెప్పేస్తుంది. ఇలా వెబ్‌సైట్‌ను అత్యాధునికంగా రూపొందించారు.

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

కొత్త స్థానికత వర్తింపు ఇలా..
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7 తరగతుల్లో చివరి 4 ఏళ్లు (అంటే 4,5,6,7 తరగతులు) ఏ జిల్లాలో చదివితే వారు ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణిస్తారు. వేర్వేరు జిల్లాల్లో చదువులు కొనసాగించిన వారి విషయంలో 4,5, 6,7 తరగతుల్లో 6,7వ తరగతులు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలోనే స్థానికులుగా పరిగణనలోకి తీసుకొంటారు.\

Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్‌ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!

మాకు దారేది..?
దూరవిద్య (ఓపెన్‌)లో టెన్త్, ఇంటర్‌ చదివిన అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీఆర్‌లో ‘ఓపెన్‌’కు సంబంధించిన ఆప్షన్‌ కనిపించకపోవడంతో ఈ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కష్టమైపోయింది. అభ్యర్థి ఆధార్‌ కార్డు వివరాలతో వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేయగానే పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సూచిస్తోంది.

ఓటీఆర్‌ ప్రక్రియలో..

TSPSC OTR


కానీ దూరవిద్యలో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పాఠశాలలో, కళాశాలలో చదివిన నేపథ్యం లేకపోవడంతో నిర్దేశించిన ఆప్షన్లను పూరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఓటీఆర్‌ ప్రక్రియలో ముందుకు సాగలేకపోతున్నారు. నోటిఫికేషన్లు వెలువడితే ఓటీఆర్‌ లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు ఓపెన్‌ అభ్యర్థులూ ఓటీఆర్‌కు అర్హులేనని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వివరాల నమోదు సమయంలో వచ్చే పేజీని కొనసాగిస్తే సరిపోతుందంటున్నారు. కానీ రిజిస్ట్రేషన్‌ సాగట్లేదని అభ్యర్థులు చెబుతున్నారు.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

​​​​​​​టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 12 Apr 2022 05:12PM
PDF

Photo Stories