TSPSC: ‘లీకేజీ’ వ్యవహారంలో ఇంత మంది డిబార్.. డిబార్ అయిన అభ్యర్థులు వీరే..
ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పలువురిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అరెస్టయి కస్టడీలో ఉన్న అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ పరీక్షల నుంచి డిబార్ చేసింది. ఆయా అభ్యర్థులను ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనర్హులుగా ప్రకటించగా... భవిష్యత్తులోనూ వారిని పరీక్షలకు అనుమతించబోమని తేల్చింది. ఇలా 50మందిని పరీక్షల నుంచి డిబార్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. డిబార్ చేసిన అభ్యర్థులు వివరణ సమర్పించాలని భావిస్తే రెండ్రోజుల్లోగా కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుందని వెబ్‌నోట్ ద్వారా వెల్లడించింది.
చదవండి: TSPSC Paper Leakage Case: మాస్ కాపీయింగ్‌తో రూ.కోటి సంపాదన.. రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు..
డిబార్ అయిన అభ్యర్థులు వీరే..
పులిదిండి ప్రవీణ్‌కుమార్, అట్ల రాజశేఖర్‌రెడ్డి, రేణుక రాథోడ్, లవడ్యావత్ దాఖ్య, కే.రాజేశ్వర్, కే.నీలేశ్ నాయక్, పి.గోపాల్‌నాయక్, కే.శ్రీనివాస్, కే.రాజేందర్ నాయక్, షమీమ్, ఎన్.సురేశ్, డి.రమేశ్‌కుమార్, ఏ.ప్రశాంత్‌రెడ్డి, టి.రాజేంద్రకుమార్, డి.తిరుపతయ్య, సాన ప్రశాంత్, వై.సాయిలౌకిక్, ఎం.సాయి సుశ్మిత, కోస్గి వెంకట జనార్థన్, కోస్గి మైబయ్య, కోస్గి రవి, కోస్గి భగవంత్ కుమార్, కొంతం మురళీధర్ రెడ్డి, ఆకుల మనోజ్ కుమార్, ఆది సాయిబాబు, పొన్నం వరున్‌కుమార్, రమావత్ మహేశ్, ముదావత్ శివకుమార్, దానంనేని రవితేజ, గున్‌రెడ్డి క్రాంతికుమార్ రెడ్డి, కొంతం శశిధర్‌రెడ్డి, అట్ల సుచరితారెడ్డి, జీపీ పురేందర్, నూతన్ రాహుల్ కుమార్, లవ్‌డ్యా శాంతి, రమావత్ దత్తు, అజ్మీరా పృథ్వీరాజ్, జాదవ్ రాజేశ్వర్, పూల రవికిశోర్, రాయపూర విక్రమ్, రాయపురం దివ్య, ధనావత్ భరత్ నాయక్, పాశికంటి రోహిత్‌కుమార్, గాదె సాయిమధు, లోకిని సతీశ్‌కుమార్, బొడ్డుపల్లి నర్సింగ్‌రావు, గుగులోత్ శ్రీనునాయక్, భుక్య మహేశ్, ముదావత్ ప్రశాంత్, వడిత్య నరేశ్, పూల రమేశ్‌కుమార్.
చదవండి: High Court: గ్రూప్–1 ప్రిలిమ్స్‌పై ఉత్తర్వులు ఇవ్వలేం