High Court: గ్రూప్–1 ప్రిలిమ్స్‌పై ఉత్తర్వులు ఇవ్వలేం

ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ప్రిలిమ్స్ వాయిదా కోరుతూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజాల్‌కు చెందిన గ్రూప్–1 అభ్యర్థి బి.వెంకటేశ్ సహా పలువురు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ తొలుత జస్టిస్ కె.లక్ష్మణ్ వద్దకు విచారణకు వచ్చింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
తన కూతురు గ్రూప్–1 పరీక్ష రాస్తున్న నేపథ్యంలో విచారణ చేపట్టడం సరికాదంటూ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం అభ్యర్థుల పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.