Governor: ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడనే పరిస్థితి దాపురించింది
పదేళ్ల కిందట మెడికల్ కళాశాలలో తాను విద్యార్థులకు క్లాస్ తీసుకుంటుండగా పరీక్షలు రాసేందుకు సర్వ సన్నద్ధమైన ఓ విద్యార్థి తనను ప్రశ్న పత్రాలు ఎక్కడ తయారవుతాయంటూ ప్రశ్నించడం ఆ నాడు జోక్‌గా ఉంటే ప్రస్తుతం అది వాస్తవరూపం దాల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: JNTUH: అధ్యాపకులు మధ్యలో కాలేజీ మారడం కుదరదు
జేఎన్టీయూహెచ్ 11వ స్నాతకోత్సవం మార్చి 18న వర్సిటీ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, ఎంటెక్, ఎం.ఫార్మ్. ఎంబీఏ, ఎంఎస్‌ఐటీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఎస్, ఫార్మ్–డి, ఫార్మ్ డి (పీబీ), పీజీ డిప్లొమా, బీటెక్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఎంఓయూ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు పట్టాలతో పాటు పతకాలను ప్రదానం చేశారు. విద్యార్ధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ గురువుల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా సమాజ వికాసానికి పంచినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు.
చదవండి: TSCHE: కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సు
సమాజానికి ఉపయోగపడని విద్యా డిగ్రీలు, పతకాలు ఎన్ని సాధించినా వ్యర్ధమేనని వ్యాఖ్యానించారు. నిత్యం టెక్నాలజీతో సహజీవనం చేస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆ సాంకేతికతను సన్మార్గంలో వినియోగించుకున్నప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇంటా, బయటా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కొంతమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థితి వద్దని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఎప్పుడూ కరెన్సీ మాత్రమే లెక్కబెట్టడం కాదని, కేలరీస్‌ను కూడా లెక్కించాలని పేర్కొంటూ ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేశారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్భోదించారు.
చదవండి: software jobs : సాఫ్ట్‌వేర్ కొలువు.. ఇక చాలా సులువు!
పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్: డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్
శాస్త్ర సాంకేతిక సంస్థలు, అనేక ఉత్పత్తుల తయారీ కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తోందని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, ఎన్‌ఐఐటీ చాన్సలర్, పద్మవిభూషణ్ డాక్టర్ కృష్ణ స్వామి కస్తూరి రంగన్ అన్నారు. వ్యవసాయ, వైద్య, ఔషధ, పరిశోధనలకు కేంద్ర బిందువుగా నగరం మారిందన్నారు. జాతీయ అవసరాలకు మాత్రమే కాకుండా ప్రపంచ డిమాండ్లను కూడా నగరం తీరుస్తోందని చెప్పారు.
చదవండి: KTR: ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి
నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇక్కడ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటుచేసి కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఆయన వెల్లడించారు. అండర్‌గ్రాడ్యుయేట్ విద్యలో వృత్తి విద్యను విలీనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైబ్రిడ్ ఉద్యోగాల సంఖ్య పెరుగుతోందని, ఈ దిశగా విద్యా వ్యవస్థను సిద్ధం చేయడంతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. డాక్టర్ కృష్ణ స్వామి కస్తూరి రంగన్‌కు జేఎన్టీయూహెచ్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. కార్యక్రమంలో జేఎనీ్టయూహెచ్ వైస్ చాన్సలర్ ప్రొ.కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్ గోవర్దన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: JNTUH: ‘బయోమెట్రిక్’ లేకపోతే ఫ్యాకల్టీగా పరిగణించం..