JNTUH: అధ్యాపకులు మధ్యలో కాలేజీ మారడం కుదరదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సెమిస్టర్ మధ్యలో, విద్యా సంవత్సరం పూర్తవ్వకుండా అధ్యాపకులు ఒక కాలేజీ నుంచి వేరొక కళాశాలకు మారడాన్ని జవహర్‌లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం నిషేధించింది.
ఇలా చేస్తే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించింది. జేఎన్టీయూ అనుబంధ కాలేజీల్లో సెమిస్టర్ పూర్తయ్యేవరకు అధ్యాపకులు ఒకే కళాశాలలో కొనసాగాలని సూచించింది. ఈ మేరకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హుస్సేన్ ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: TSCHE: కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సు
అధ్యాపకులు కాలేజీ నుంచి మరో కళాశాలకు మారాలనుకుంటే 2 నెలల ముందుగా నోటీసు ఇవ్వాలని...వర్సిటీకి సమాచారమివ్వాలని అందులో పేర్కొన్నారు. తరచుగా మారే ఫ్యాకలీ్టని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేశారు. దీనిపై ఉద్యోగుల అసోసియేషన్ నేత సంతోష్ కుమార్ స్పందిస్తూ.. ముందుగా ఉద్యోగుల నెలవారీ జీతాల చెల్లింపుపైనా జేఎన్టీయూ దృష్టి సారించాలని కోరారు.
Published date : 15 Feb 2023 03:56PM